వాట్సప్‌పై కఠినమైన ఆంక్షలు జారీ చేసిన కుప్వారా అధికారులు

జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లా అధికారులు వాట్సప్ గ్రూపు మీద కఠినమైన ఆంక్షలను జారీ చేశారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాట్సప్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు ఎక్కువగా సర్క్యుల

|

జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లా అధికారులు వాట్సప్ గ్రూపు మీద కఠినమైన ఆంక్షలను జారీ చేశారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాట్సప్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న సంగతి తెలిసిందే. వీటిని కట్టడి చేసేందుకు అక్కడి అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1వ తేదీన ఈ ఆర్డర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆర్డర్ ప్రకారం ఎవరైనా వాట్సప్ గ్రూపు క్రియేట్ చేస్తే దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి.

వాట్సప్‌పై కఠినమైన ఆంక్షలు జారీ చేసిన కుప్వారా అధికారులు

రిజిస్టర్ అయిన తరువాతనే ఈ గ్రూపు నుంచి ఏ సమాచారమైనా షేర్ చేయబడుతుందని ఆర్డర్ పాస్ చేసింది. ఈ విషయాన్ని ఈటి తొలిసారిగా గుర్తించింది.

ఆర్డర్ జారీ

ఆర్డర్ జారీ

కాగా ఈ ఆర్డర్ పై అక్కడి district magistrate (DM) Anshul Garg సంతకం పెట్టినట్లుగా తెలుస్తోంది. లోకల్ పోలీస్ స్టేషన్లలో దీనికి సంబంధించి రిజిస్టర్ కార్యక్రమం కూడా నడుస్తోందని అక్కడి వాసులు చెబుతున్నారు. పోలీసు అధికారులు కూడా వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవాలంటే స్టేషన్లో రిజిస్టర్ చేసుకోవాలని కూడా చెబుతున్నారు.

కంపెనీల రెస్సాండ్

కంపెనీల రెస్సాండ్

కాగా ఈ విషయంపై సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సప్, ఫేస్ బుక్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈ విషయం మీద ఇవి ఇంకా స్పందించలేదు. కాగా ఈ ఆర్డర్ ప్రకారం ఫేక్ న్యూస్ లనేవి భారీగా తగ్గుతాయని రూమర్లకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మార్చి 15 నుంచి

మార్చి 15 నుంచి

కాగా ఎవరైనా అక్కడి వాసులు వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా అక్కడ గవర్నమెంట్ ఆఫీసుల్లో కాని న్యాయస్థానంలో కాని అనుమతి తీసుకోవాలని అక్కడి రిజిస్టర్ అయిన తరువాతే గ్రూపు స్టార్ చేయాలని తెలుస్తోంది. దీంతో పాటు గ్రూపులో తెలిసిన వారిని మాత్రమే జాయిన్ చేసుకోవాలని ఎవరిని పడితే వారిని జాయిన్ చేసుకోవడానికి వీల్లేదని ఆర్డర్ చెబుతోంది.

under Section 144

under Section 144

కాగా ఈ ఆర్డర్ under Section 144 కింద జారీ చేశారని Internet Freedom Foundation executive director అయిన Apar Gupta తెలిపారు. దీని ద్వారా క్రిమినెల్ కేసులు తగ్గే అవకాశం ఉందని న్యాయ సూత్రాలకు అనుగుణంగా అందరూ నడుచుకుంటారని తెలిపారు.

Best Mobiles in India

English summary
Ahead of elections, Kupwara WhatsApp admins on watch

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X