గూగుల్ న్యూస్‌లో ఈ కొత్త మార్పులను గమనించారా ?

|

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్ తన ప్లే న్యూస్ స్టాండ్ యాప్‌ను న్యూస్ యాప్‌గా మార్చింది. ఈ న్యూస్‌ యాప్‌లో కొత్త ఫీచర్లను జత చేసింది. డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఇటీవల చేసిన న్యూస్ యాప్ సరికొత్తగా తీసుకువస్తామని వాగ్ధానం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గూగుల్ అధికారికంగా ఐవోఎస్‌కోసం "గూగుల్ న్యూస్" యాప్‌ ను ప్రారంభించింది. దీన్ని న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత యాప్‌ను మెషిన్-లెర్నింగ్ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్‌ఫాంలపై వచ్చే వారం నుంచి లభ్యం కానుంది.

 

ఆపిల్ నుంచి ఐఫోన్ ఎస్ఈ2 , అచ్చం Iphone X లాగే..ఆపిల్ నుంచి ఐఫోన్ ఎస్ఈ2 , అచ్చం Iphone X లాగే..

మూడు ఎంపికలతో..

మూడు ఎంపికలతో..

కొత్తగా వచ్చిన ఈ న్యూస్ యాప్‌లో ఫర్ యు, ఫుల్‌ కవరేజ్, న్యూస్‌ స్టాండ్ అనే మూడు ఎంపికలతో వస్తుంది, యూజర్లు వీటిని పొందాలంటే 2014 లో ప్రారంభించిన గూగుల్ ప్లే న్యూస్ స్టాండ్‌ను యూజర్లు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారంలో ఈ కొత్త యాప్ అప్‌డేట్ 127 దేశాల యూజర్లకు అందుబాటులోకి వస్తుందని గూగుల్‌ ప్రకటించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

గూగుల్ న్యూస్ యాప్ పూర్తిగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా పనిచేస్తుంది. యూజర్లకు చెందిన ప్రాంతం, భాష తదితర అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అందుకు తగిన విధంగా న్యూస్ అప్‌డేట్లను సదరు యాప్‌లో అందిస్తుంది.

ఫర్ యూ ఫీచర్
 

ఫర్ యూ ఫీచర్

ఫర్ యూ అనే ఫీచర్ సహాయంతో యూజర్లు అత్యంత ముఖ్యమైన వార్తలు ఐదింటిని తెలుసుకోవచ్చు. యూజర్ అభిరుచులకు అనుగుణంగా ఇవి యాప్‌లో కనిపిస్తాయి.

ఫుల్ కవరేజ్ ఫీచర్

ఫుల్ కవరేజ్ ఫీచర్

అలాగే ఫుల్ కవరేజ్ అనే మరో ఫీచర్ కూడా ఈ యాప్‌లో లభిస్తుంది. దీని వల్ల ఏదైనా అంశం గురించి లోతుగా పూర్తి సమాచారాన్ని రియల్ టైంలో యూజర్లు తెలుసుకోవచ్చు. ఎక్కువగా స్థానిక వార్తలు యూజర్లకు తెలిసేలా న్యూస్ యాప్‌లో సదుపాయం కల్పించారు. దీని వల్ల యూజర్లకు తమ చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశం.

న్యూస్‌ స్టాండ్‌ ఫీచర్

న్యూస్‌ స్టాండ్‌ ఫీచర్

న్యూస్‌ స్టాండ్‌ ఆప్షన్‌లో, వెబ్ వార్త కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం స్పెషల్‌ స్ప్లాష్ పేజీని క్రియేట్‌ చేసింది. తద్వారా మొబైల్ బ్రౌజర్ ద్వారా బౌన్సింగ్‌ బెడద లేకుండా చాలా క్విక్‌ అండ్‌ క్లీన్‌గా వార్తలను లోడ్ చేస్తుంది.

ఫేవరేట్‌ సెక్షన్‌ ఫీచర్

ఫేవరేట్‌ సెక్షన్‌ ఫీచర్

అంతేకాదు ఫేవరేట్‌ సెక్షన్‌ అనే మరో ఆప్షన్‌ను కూడా జోడించింది. దీని ద్వారా అభిమాన స్టార్ల వార్తలను తెలుసుకోవచ్చు. దీంతోపాటు కంటెంట్‌ను సేవ్‌ చేసుకుని తీరిక ఉన్నపుడు చదువుకునే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
The new AI-powered Google News app is now available on iOS More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X