ఎయిర్‌సెల్ రోమింగ్ ‘ఫ్రీ’ ప్లాన్

Posted By:

ప్రముఖ మొబైల్ నెట్‌వర్కింగ్ ఆపరేటర్, ఎయిర్‌సెల్ ‘వన్ నేషన్, వన్ రేట్' పేరుతో ఉచిత రోమింగ్ సర్వీస్‌ను అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టారిఫ్ ప్లాన్‌లో భాగంగా వాయిస్, ఎస్ఎంఎస్ ఇంకా డాటా వినియోగానికి సంబంధించి హోమ్ సర్కిళ్లలోనూ అలానే ఎయిర్‌సెల్ నెట్‌వర్క్ పై రోమింగ్‌లో ఉన్నప్పుడు ఒకే ధరను ఛార్జ్ చేయనున్నారు.

ఈ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌సెల్ నెట్‌వర్క్ పై ఇన్ కమింగ్ కాల్స్‌కు రోమింగ్ పూర్తిగా ఉచితమని కంపెనీ పేర్కొంది. ఈ తరహా ఆఫర్‌ను దేశీయంగా మొట్టమొదటి ఆఫర్ చేస్తుంది తామేనని ఎయిర్‌సెల్ ఈ సందర్భంగా వివరించింది.

టెలిఫోన్ సర్కిళ్లను బట్టి ఈ ఆఫర్‌ను రూ.21 నుంచి రూ.59 ధరల్లో అందిస్తున్నామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌కు సంబంధించి ఈ ఆఫర్ రూ.25కు లభ్యమవుతోంది.

ఎయిర్‌సెల్ రోమింగ్ ‘ఫ్రీ’ ప్లాన్

‘వన్ నేషన్, వన్ రేట్' ప్లాన్‌లో భాగంగా లబ్ధి చేకూరే ఫీచర్ల వివరాలు:

వాయిస్: హోమ్ సర్కిల్ అలానే రోమింగ్‌లలో లోకల్ ఇంకా ఎస్ టీడీ కాల్స్ పై సెకనుకు ఒక పైసాను మాత్రమే వసూలు చేస్తారు. ఎయిర్‌సెల్ నెట్‌వర్క్ పై వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్‌‌కు రోమింగ్ పూర్తిగా ఉచితం.

ఎస్ఎంఎస్: హోమ్ సర్కిల్ అలానే రోమింగ్‌లలో లోకల్ ఇంకా ఎస్‌టీడీ ఎస్ఎంఎస్‌ల పై రూ.1/ను వసూలు చేస్తారు.

డాటా: హోమ్ సర్కిల్ అలానే రోమింగ్‌లలో 1ఎంబి డేటా వినియోగానికి రూ.1 ఛార్జ్ చేస్తారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot