ఎయిర్‌సెల్ దివాలా వెనుక బలమైన కారణాలు ఏంటి, దాని రాకే కొంప ముంచిందా ?

Written By:

ఆర్థికపరమైన ఒత్తిడులు తీవ్రంగా ఉన్న టెలికాం రంగంలో 'అత్యంత క్లిష్టమైన సమయాల'ను ఎదుర్కొంటున్నామని చెబుతూ టెలికాం ఆపరేటరు ఎయిర్‌సెల్‌ దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో కంపెనీ ఈ మేరకు పిటీషన్‌ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త ఆపరేటరు రాకతో ధరల యుద్ధం మొదలు కావడంతో రుణాలు, నష్టాలు పెరుగుతూ వచ్చాయని అందులో పేర్కొంది. దివాలా చట్టం 2016లోని సెక్షన్‌ 10 కింద ఎయిర్‌సెల్‌ సెల్యులార్, డిష్‌నెట్‌ వైర్‌లెస్, ఎయిర్‌సెల్‌ లిమిటెడ్‌ సంస్థలు కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రక్రియ చేపట్టాలంటూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. మరి దీని వెనుక అనేక ఆసక్తికర కారణాలు కూడా ఉన్నాయి.

5 సంవత్సరాల పాటు ఉచితంగా డీటీహెచ్ సేవలు, రిలయన్స్ ఆఫర్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో రాకతో పోటీ తీవ్రమవడం

కొత్త సంస్థ జియో రాకతో పోటీ తీవ్రమవడం, చట్ట.. నియంత్రణ సంస్థలపరమైన సవాళ్లు, పెరిగిపోయిన రుణభారం, భారీ నష్టాలు మొదలైన వాటి కారణంగా 'వ్యాపారంపైనా, పరపతిపైనా గణనీయంగా ప్రతికూల ప్రభావం' పడినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

బీహెచ్‌డీకి ఎయిర్‌సెల్‌లో 74 శాతం వాటా

మలేషియాకు చెందిన మాక్సిస్‌ కమ్యూనికేషన్స్‌ బీహెచ్‌డీకి ఎయిర్‌సెల్‌లో 74 శాతం వాటా ఉంది. మొదట రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌తో విలీనం కావాలని ఈ కంపెనీ ప్రయత్నించినప్పటికీ.. గతేడాది చివర్లో విఫలం అయింది. రూ.15,500 కోట్ల రుణ పునర్నిర్మాణ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. అన్ని దారులూ మూసుకోవడంతో నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ముంబయి) దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది.

1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

మలేషియాలోనే మూడో అత్యంత ధనవంతుడైన క్రిష్ణన్‌ 2005లో ఈ కంపెనీలో మెజారిటీ వాటాను కొన్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం అప్పట్లో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. డిసెంబరు చివరకు ఈ కంపెనీకి 8.5 కోట్ల మంది వినియోగదార్లున్నారు. భారత్‌లో ఆరో అతిపెద్ద ఆపరేటరుగా ఉంది.

పోటీ పెరగడంతో

పోటీ పెరగడంతో తట్టుకోలేని ఈ కంపెనీ ఇటీవలే ఆరు సర్కిళ్లలో గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌(పశ్చిమ)లలో సేవలను నిలిపివేసింది.

దీంతో పాటు..

దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, అసోం, బిహార్‌, దిల్లీ, జమ్ము-కశ్మీర్‌, కర్ణాటక, కేరళ, కోల్‌కతా, ముంబయి, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌(తూర్పు), పశ్చిమ బంగ తదితర లైసెన్సింగ్‌ సేవల ప్రాంతాల్లో సేవల అంతరాయంతో భారీ స్థాయిలో వినియోగదార్లు అసౌకర్యానికి గురయ్యారు.

నంబరు పోర్టబులిటీ

నంబరు పోర్టబులిటీ ద్వారా వారంతా వేరే ఆపరేటర్లను వెతుక్కున్నారు.ఈ పరిణామంతో ట్రాయ్‌ సైతం మంగళవారం వినియోగదార్లు సులభంగా వేరే నెట్‌వర్క్‌కు వెళ్లేలా అదనంగా పోర్ట్‌ అవుట్‌ కోడ్స్‌ను ఎయిర్‌సెల్‌కు కేటాయించింది.

రిలయన్స్‌ జియో దెబ్బ

కొత్త ఆపరేటరు రిలయన్స్‌ జియో రావడంతోనే అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించడంతో మిగతా ఆపరేటర్లు సైతం వాటిని అందుకోవడానికి ప్రయత్నించాయి. దీంతో వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతినింది. అప్పులు పెరిగాయి. చాలా వరకు చిన్న ఆపరేటర్లు ఒత్తిడిని తట్టుకోలేక.. పెద్ద ఆపరేటర్లలో విలీనం అయ్యాయి.

టెలినార్‌

టెలినార్‌ తన భారత్‌ వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించడానికి అంగీకరించింది. అదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్‌ కూడా టాటా టెలీసర్వీసెస్‌కు చెందిన మొబైల్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌

డిసెంబరు 2017లో ముకేశ్‌ అంబానీ తన సోదరుడు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు చెందిన స్పెక్ట్రమ్‌, టవర్లు, ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌, ఇతరత్రా వైర్‌లెస్‌ ఆస్తులను కొనుగోలు చేశారు.

వొడాఫోన్‌, ఐడియాలు

ఇక వొడాఫోన్‌, ఐడియాలు విలీన ప్రక్రియలో ఉండడంతో భారత టెలికాం మార్కెట్లో కేవలం మూడు నాలుగు ఆపరేటర్లు మాత్రమే మిగులుతాయని విశ్లేషకులు అంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Aircel, country's last small mobile phone operator, files for bankruptcy More news at Gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot