ఎయిర్‌సెల్ ‘ఆగష్టు 15’ ఆఫర్ (ఒక్క దెబ్బకు మూడు పిట్టలు)

Posted By: Staff

 ఎయిర్‌సెల్ ‘ఆగష్టు 15’ ఆఫర్ (ఒక్క దెబ్బకు మూడు పిట్టలు)

ప్రముఖ టెలికామ్ నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎయిర్‌సెల్ స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘స్పెషల్ మొబైల్ హ్యాండ్‌సెట్ ప్లాన్’ను మంగళవారం నుంచి అందిచనుంది .‘1508’ పేరుతో విడుదలవుతున్న ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా యూజర్ రూ.1508 విలువ చేసే జీపీఆర్ఎస్ డ్యూయల్ సిమ్ ఫోన్‌తో పాటు రూ.1508 విలువచేసే టాక్‌టైమ్, 1508 టెక్స్ట్ సందేశాలు అదేవిధంగా 1508 ఎంబీ 2జీ డేటాను ఉచితంగా పొందవచ్చు. ఈ డేటా వినియోగానికి 90 రోజుల వ్యాలిడిటీని కల్పిస్తున్నారు. ఈ స్పెషల్ ఆఫర్‌ పొందాలంటే యూజర్ రూ.1508 చెల్లిస్తే సరిపోతుంది. ఆగష్టు 14 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ ఆఫర్ 90 రోజుల పాటు ఉంటుంది. ఔత్సాహికులు ఎయిర్‌సెల్ స్టోర్‌లలో సంప్రదించవచ్చు.

ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌సెల్ అందిస్తున్న డ్యూయల్ సిమ్ జీపీఆర్ఎస్ ఫోన్ ‘ఆల్కాటెల్ వోటీ 318’ కీలక ఫీచర్లు:

డిస్ ప్లే రిసల్యూషన్ (128×160పిక్సల్స్),

బ్యాటరీ బ్యాకప్ (6 గంటల టాక్ టైమ్, 400 గంటలు స్టాండ్ బై),

డ్యూయల్ సిమ్,

టార్చ్ లైట్,

వైబ్రేటర్,

వీజీఏ కెమెరా,

ఎంపీత్రీ రింగ్ టోన్స్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot