ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌సెల్ 4జీ సేవలు

Posted By:

భారతదేశపు ప్రముఖ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్‌సెల్ బుధవారం భారత్‌లోని 4 సర్కిళ్లలో 4జీ ఎల్టీఈ వైర్‌లెస్ బ్రాండ్ సేవలను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, ఒడిశా సర్కిళ్లలో ఎయిర్‌సెల్ 4జీ ఎల్టీఈ వైర్‌లెస్ బ్రాండ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ 4జీ సేవలకు సంబంధించిన టారిఫ్ ప్లాన్‌లను ఎయిర్‌సెల్ వెల్లడించలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌సెల్ 4జీ సేవలు

ఈ తాజా ఆవిష్కరణతో భారత్‌లో 4జీ సేవలనందిస్తోన్న రెండవ టెలికామ్ ఆపరేటర్‌గా ఎయిర్ సెల్ నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే దేశంలోని పలు సర్కిళ్లలో 4జీ సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే.

ఎయిర్‌సెల్ దేశవ్యాప్తంగా 8 సర్కిళ్లలో 4జీ ఎల్టీఈ 2300 మెగాహెట్జ్ బ్యాండ్ సేవలను అందించేందుకు 20 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్న  విషయం తెలిసిందే. ఎయిర్‌సెల్ 4జీ సేవలు అందుబాటులోకి వచ్చే సర్కిళ్లలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, బిహార్, ఒడిశా, ఆస్సాం,నార్త్ ఈస్ట్ జమ్మూ కాశ్మీర్‌లు ఉన్నాయి.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot