రూ.14తో దేశమంతా కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ..

ప్రముఖ టెలికం ఆపరేటర్ Aircel రెండు సరికొత్త ప్లాన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. రూ.14, రూ.249 స్కీమ్స్‌లో అందుబాటులో ఉన్న ఈ స్పెషల్ ప్లాన్స్ ద్వారా ఎయిర్‌సెల్ యూజర్లు దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది.

Read More : కోడింగ్ అవసరంలేదు, కేవలం 20 నిమిషాల్లో యాప్ తయారు చేయండి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.14 ప్లాన్‌లో అన్‌‌లిమిటెడ్ కాల్స్

15 నిమిషాల్లో 35,000 ఫోన్‌లు అమ్మేసారు

ఒక రోజు వ్యాలిడిటీతో వస్తోన్న రూ.14 ప్లాన్‌లో భాగంగా లోకల్, ఎస్‌టీడీ అన్న బేధం లేకుండా దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంటుంది.

రూ.249 ప్యాక్‌లో భాగంగా..

28 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న రూ.249 ప్యాక్‌లో భాగంగా ఎయిర్‌సెల్ యూజర్ దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచితం కాల్స్ చేసేకునే వీలుంటుంది. ఎటువంటి రోమింగ్ ఛార్జీులు వర్తించవు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

1.5జీబి ఇంటర్నెట్ డేటా కూడా..

నోకియా, రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది

ఈ ప్లాన్‌లో భాగంగా 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లకు 1.5జీబి 2జీ ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తుంది. 3జీ సర్కిల్‌లో ఉన్న యూజర్లకు 2జీ డేటాతో పాటు 500 ఎంబి 3జీ డేటా
కూడా లభిస్తుంది.

రూ.148తో మూడు నెలల వాయిస్ కాలింగ్ ఉచితం

ఢిల్లీ వాసుల కోసం ఎయిర్‌సెల్ సరికొత్త ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. FRC148 పేరుతో లాంచ్ అయిన, ఈ సరికొత్త ఎయిర్‌సెల్ ప్లాన్ 90 వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌సెల్ - ఎయిర్‌సెల్ కాల్స్ పూర్తిగా ఉచితం.

15,000 సెకన్లు ఉచితం

ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసుకునేందుకుగాను నెలకు 15,000 సెకన్లు ఉచితంగా లభిస్తాయి. అంటే, నెలకు 250 నిమిషాలు పాటు ఇతర నెట్‌వర్క్‌లతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఫ్రీ కాల్స్ ముగిసిన తరువాత నిమిషాను 30 పైసలు వసూలు చేయటం జరుగుతుందని ఎయిర్‌సెల్ తెలిపింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్ మొదటి నెల రోజుల పాటు 2జీ డేటాను అపరిమితంగా వినియోగించుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Aircel Launches Unlimited Voice Calling Packs Starting at Rs.14!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot