రూ.3కే 1జీబి 3జీ డేటా

ప్రముఖ టెలికం ఆపరేటర్ ఎయిర్‌సెల్ సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. "Good Morning Pack" పేరుతో లభించే ఈ ఆఫర్‌లో భాగంగా రూ.3కే 1జీబి 3జీ డేటాను పొందవచ్చు. ఈ డేటాను ఉదయం 7 గంటల నుంచి 9 గంటలలోపు మాత్రమే ఉపయోగించుకోవల్సి ఉంటుంది.

రూ.3కే 1జీబి 3జీ డేటా

ప్రస్తుతానికి ఆ సదుపాయం జమ్మూకాశ్మీర్ సర్కిల్ పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని సర్కిల్స్‌కు ఈ ఆఫర్‌ను విస్తరించనున్నట్లు సమాచారం. 'Data on Demand' పేరుతో ఎయిర్‌సెల్ ఇటీవల ఓ ఆఫర్‌ను కోల్‌కతా, బిహార్, ఒడిసా, నార్త్‌ ఈస్ట్ ఇంకా అస్సాం సర్కిళ్లలో లాంచ్ చేసింది.ఈ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌సెల్ యూజర్లు సమయానుకూలంగా డేటాను ఉపయోగించుకునే వీలుంటుంది. సూపర్ డిస్కౌంట్ రేట్లలో భాగంగా రూ.9కే 1జీబి 3జీ డేటాను పొందే వీలుంటుంది.

English summary
Aircel offers 1GB 3G data from 7 am to 9 am at Just Rs 3. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot