ఎయిర్‌సెల్ నుంచి ఏడాది ఆఫర్, ధర రూ. 104కే
దిగ్గజాలకు సవాల్ విసురుతూ ఎయిర్‌సెల్ సరికొత్త ప్లాన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది.
దిగ్గజాలకు సవాల్ విసురుతూ ఎయిర్‌సెల్ సరికొత్త ప్లాన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. రూ. 104లో ఏడాది కాలం పాటు వ్యాలిడిటీ ఉండేలా ఈ ప్లాన్ ప్రకటించింది. ఈ కొత్త టారిఫ్ కింద కాల్ రేట్లను నిమిషానికి 20 పైసలకి తగ్గించింది. ఈ తగ్గించిన రేట్లు ఎస్టీడీ, లోకల్ కాల్స్ అన్నింటికీ వర్తించనున్నట్టు పేర్కొంది.

ఢిల్లీ సర్కిల్‌లోని ఎయిర్‌సెల్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే
అమెజాన్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని అపరిమిత కాలింగ్ ప్లాన్ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన అనంతరం ఈ కొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాక్ కేవలం ఢిల్లీ సర్కిల్‌లోని ఎయిర్‌సెల్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంచింది.

నిమిషానికి 20 పైసల టారిఫ్
నిమిషానికి 20 పైసల టారిఫ్‌ను లాంచ్ చేయడంతో, కేవలం పాత కస్టమర్లతో తమ సంబంధాలు మెరుగుపడటమే కాకుండా.. కొత్త టెలికాం యూజర్లు ఎయిర్‌సెల్‌ను ఎంపిక చేసుకునేలా చేయనున్నామని కంపెనీ నార్త్ రీజనల్ హెడ్ హరీష్ శర్మ చెప్పారు.

రూ.88తో వీక్ ప్లాన్
కాగా అంతకముందు కూడా ఎయిర్‌సెల్ రూ.88తో వీక్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. దీని కింద రోజుకు 1జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. 28 రోజుల కోసం రూ.199 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

గట్టి పోటీ..
ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడానికి ఎయిర్‌సెల్ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ష్టాల పాలైన ఎయిర్‌సెల్
టెలికాం దిగ్గజాల దెబ్బకు నష్టాల పాలైన ఎయిర్‌సెల్, ఆర్‌కామ్‌తో విలీనమవ్వాలని అనుకుంది. కానీ ఇటీవలే ఈ రెండు కంపెనీల విలీన చర్చలు సఫలమయ్యాయి.


Click it and Unblock the Notifications








