10జీబి 4జీ డేటా రూ.259కే, అన్ని ఫోన్‌లకు వర్తిస్తుంది

సామ్‌సంగ్ గెలాక్సీ జే సిరీస్ ఫోన్‌ల కోసం ఎయిర్‌టెల్ ఇటీవల ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ చేసిన 10జీబి 4జీ డేటా రూ.259 ఆఫర్ ఇప్పడు అన్ని 4జీ స్మార్ట్‌ఫోన్‌లకు వర్తిస్తుందని ఎయిర్‌టెల్ తెలిపింది. కొత్తగా 4జీ ఫోన్‌ను కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ఈ ఆఫర్ వర్తించనుంది.

Read More : 18 రోజుల్లో 10 లక్షల ఫోన్‌లు అమ్మిన Xiaomi

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ప్లాన్‌లో భాగంగా...

ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ కొత్త కనెక్షన్‌ను కలిగి ఉన్న కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.259 చెల్లించి 1జీబి 4జీ డేటాను రీఛార్జ్ చేసుకున్నట్లయితే అదనంగా మరో 9జీబి 4జీ డేటా వారివారి అకౌంట్‌లలో జమవుతుంది

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మై‌ఎయిర్‌టెల్ యాప్ ద్వారా

మై‌ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఈ 9 జీబి డేటా లభిస్తుందని ఎయిర్‌టెల్ తెలిపింది.
ఈ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో వాడుకోవచ్చు.

30 రోజుల్లోపు స్పందించాలి

ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్న కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు 30 రోజుల్లోపు స్పందించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆఫర్ వర్తించదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమీపంలోని Airtel..?

సమీపంలోని Airtel Retail outlet లేదా www.offers.airtel.comలోకి ఎయిర్‌టెల్ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా లాగినై ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

అందుబాటులో లేని ప్రాంతాల్లో 3జీ..

4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో 10జీబి 3జీ డేటాను యూజర్లు అదే ధరకు పొందవచ్చు. 

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

90 రోజుల వ్యవధిలో ..

90 రోజుల వ్యవధిలో మూడు సార్లు ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా మూడు నెలల పాటు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. దేశవ్యాప్తంగా 18 సర్కిళ్లలో ఎయిర్‌టెల్ 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel's 10GB 4G Data at Rs.259 Offer Extended to All Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot