Home
News

Airtel రూ.129,రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌లు అధిక ప్రయోజనాలతో దేశం అంతటా లభ్యత

ఇండియాలోని టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు చాలా రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నప్పటికి ఎక్కువ మంది ఇష్టపడేవి మాత్రమే ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు మాత్రమే. వినియోగదారులు తమ యొక్క సీమ్ ఆక్టివేషన్ లో ఉంచుకోవడానికి కూడా ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా భారతి ఎయిర్‌టెల్ తన ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల లభ్యతను దేశం అంతటా మరింత ఎక్కువగా విస్తరిస్తూనే ఉంది.

భారతి ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ యొక్క ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.129 మరియు రూ.199 ఒకప్పుడు కొన్ని ప్రాంతాలలో మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు సంస్థ ఈ ప్లాన్‌లను దేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది మేలో ప్రవేశపెట్టిన రూ.129, రూ.199 ప్లాన్‌లు కొన్ని సర్కిల్‌లకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అయితే ఎయిర్‌టెల్ ఇప్పుడు ప్రతి సర్కిల్‌లలోను రూ.149, రూ.179, రూ.249 మరియు అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఏదేమైనా సంస్థ యొక్క రూ.99 ధర గల బేస్ అన్‌లిమిటెడ్ కాంబో ప్లాన్ కొన్ని సర్కిల్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్‌ పూర్తి వివరాలు

ఎయిర్టెల్ రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్‌ పూర్తి వివరాలు

భారతి ఎయిర్‌టెల్ సంస్థ అందిస్తున్న ఎంట్రీ లెవల్ ప్లాన్‌లలో రూ.129 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ అపరిమిత వాయిస్ కాలింగ్, 1GB డేటా మరియు 300SMS ప్రయోజనాలను 24 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది మొత్తం చెల్లుబాటు కాలానికి హెలొటూన్స్ ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తుంది. వీటితో పాటుగా వింక్ మ్యూజిక్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ చందాలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రస్తుతం 350 కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను చందాదారులకు ఉచితంగా అందిస్తోంది.

ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ పూర్తి వివరాలు

ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ పూర్తి వివరాలు

భారతి ఎయిర్‌టెల్ సంస్థ తక్కువ ధరలో రోజువారి డేటాను అందిస్తున్న మొదటి ప్లాన్ ఇది. రూ.199 ధర వద్ద లభించే ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది వినియోగదారులకు రోజుకు 1GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 24 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. మొత్తం చెల్లుబాటు కాలానికి వినియోగదారులు రూ.199 ప్యాక్‌తో మొత్తంగా 24GB డేటా ప్రయోజనంను పొందుతారు. ఈ ప్లాన్ తో వినియోగదారులు వింక్ మ్యూజిక్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ చందాలకు ఉచిత యాక్సిస్ ను అందుకుంటారు.

ఎయిర్‌టెల్ Vs జియో ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ Vs జియో ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ యొక్క రూ.129 మరియు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్లు రెండూ ఇప్పుడు భారతదేశంలోని అన్ని వర్గాలలో లభిస్తాయి. రిలయన్స్ జియో సంస్థ రూ.129 ఇదే ధర వద్ద 2GB డేటా, అన్‌లిమిటెడ్ ఆన్-నెట్ వాయిస్ కాలింగ్, 1,000 నిమిషాల FUP నాన్-జియో కాల్స్ మరియు 300SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ రెండింటిని పోల్చి చూస్తే ఎయిర్టెల్ యొక్క రూ.129 ప్లాన్‌ కంటే రిలయన్స్ జియో ప్లాన్ మెరుగైన ఎక్కువ డేటా ప్రయోజనంతో రేసులో ముందుది. అయితే భారతీ ఎయిర్‌టెల్ తన చందాదారులకు ఎటువంటి FUP పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తోంది. ఈ విషయంలో మాత్రం ఎయిర్‌టెల్  ముందంజలో ఉంది. 

Best Mobiles in India

English summary
Airtel 129 and 199 Prepaid Plans Now Available on Pan-India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X