కంపెనీకి షాకిస్తున్న Airtel చిన్నది, జియోలోకి జంప్ !
ఎయిర్‌టెల్ 4జీతో ఫేమస్ అయిన చిన్నది అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో తన అందంతో Airtel 4G యాడ్‌ను పరుగులు పెట్టించింది.
ఎయిర్‌టెల్ 4జీతో ఫేమస్ అయిన చిన్నది అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో తన అందంతో Airtel 4G యాడ్‌ను పరుగులు పెట్టించింది. ఈ యాడ్ లో ఇన్మర్ మేషన్ కంటే యాడ్ గర్ల్ చాలా ఫేమస్. ఒక్కయాడ్ తోనే కోట్లాది యువకుల హృదయాల్ని కొల్లగొట్టింది. ఆమె పేరు శాషా ఛెత్రి..కాగా ఈ ముద్దుగుమ్మ ఎయిర్‌టెల్‌ను విడిచిపెట్టేసి జియో వైపు వెళ్లిపోతోందని తెలుస్తోంది. రాజకీయ నాయకులు, అలాగే యాంకర్లు మారినట్టే ఈ ముద్దుగుమ్మ కూడా కంపెనీని విడిచిపెట్టి వెళుతోందని ఆమె పోస్టును బట్టి తెలుస్తోంది. శాషా ఛెత్రి తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేసింది.

Crazy Guys అంటూ..
ఈ ఎయిర్ టెల్ యాడ్ లో కనిపించే శాషా ఛెత్రి మధ్యప్రదేశ్ కు చెందిన అమ్మాయి. ఎంబీఏ చదవిన ఈ ముద్దుగుమ్మ Crazy Guys అంటూ యాడ్ లో మెరిసిపోతున్న ఈ అమ్మడు క్రేజీ అంటూనే కుర్రకారుకు క్రేజీ అయ్యింది.

ఏయిర్ టెల్ 4జీ గర్ల్ గా పేరు
పొట్టిహెయిర్ కట్, గుండ్రటి నగుమోము, చూస్తూ ఉంటే చూడాలనిపించే సౌందర్యం, చక్కటి వాక్ చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది శాషా ఛెత్రి. ఈమె పేరేమో గాని ఏయిర్ టెల్ 4జీ గర్ల్ గా పేరు సంపాదించింది.

2015లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో..
2015లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మొట్టమొదటి స్థానాన్ని దక్కించుకుందంటే ఆశ్చర్యం కలగకమానదు. 2015 డిసెంబర్ 1వరకు ఈ క్రేజీ బ్యూటీ టీవీ స్క్రీన్ పై 475గంటలపాటు కనిపించింది. దీంతో సోషల్ మీడియా నెట్ వర్క్ లన్నీ శాషా ఛెత్రికి దాసోమయ్యాయి.

గోడ దూకనున్నట్లు సమాచారం
అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ఎయిర్ టెల్ 4జీ పాప త్వరలో గోడ దూకనున్నట్లు సమాచారం. శాషా ఛెత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను బట్టి ఆమె జంప్ అయ్యే అవకాశాలు తెలుస్తోంది.

తగినది ఎన్నుకోండి
నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అందరూ ప్రయత్నాలు సాగించండి. తగినది ఎన్నుకోండి. జీవితంలో ప్రతీదీ ప్రయత్నించాల్సిదే! లేకపోతే తప్పొప్పులు ఎలా తెలుస్తాయి?

ఇక్కడ ఒక విషయం నాకు నచ్చలేదు. నేను ఇతరులకు మాత్రమే... మీరు ఫలానా కంపెనీ సిమ్ వాడండి... సరైనది ఎంచుకోండి. అని చెబుతున్నాను.

ఒక్కొక్కటీ ప్రయత్నిస్తూ
అందుకే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై నేను కూడా ఒక్కొక్కటీ ప్రయత్నిస్తూ, అన్ని కంపెనీలనూ ట్రై చేస్తాను.

ఇతర కంపెనీల స్పీడ్ నచ్చకపోతే..
అయితే ఇది నా చివరి నిర్ణయం కాదు. ఒకవేళ నాకు ఇతర కంపెనీల స్పీడ్ నచ్చకపోతే తిరిగి ఎయిర్‌టెల్‌కు తిరిగి వచ్చేస్తా!' అని ఆ వీడియోలో నవ్వుతూ చెప్పింది.

సోషల్ మీడియాలో వైరల్
ప్రస్తుతం శాషా ఛెత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications








