Airtel 5G నెట్ స్పీడ్ ఎలా ఉంది.. సేవ‌లు ఏ సిటీల్లో అందుతున్నాయి!

|

దేశంలో రెండో అతి పెద్ద టెలికాం కంపెనీ అయిన‌ భారతీ Airtel , ఇటీవ‌ల‌ 5G సేవలను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. 5G నెట్‌వ‌ర్క్ ప్రారంభం గురించి ఆ కంపెనీ అధినేత సునీల్ భారతి మిట్టల్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ, ఏయే నగరాలు ఎయిర్‌టెల్ యొక్క 5G పొందాయనే దాని గురించి ఇంకా అనిశ్చితి ఉంది. అయితే, అందుకు సంబంధించి కంపెనీ ద్వారా ఇప్ప‌టికే ప‌లు విష‌యాలు ధ్రువీక‌రించ‌బ‌డ్డాయి. Airtel యొక్క 5G నెట్‌వర్క్‌లకు సంబంధించిన ఏయే న‌గ‌రాల్లో 5జీ అందుబాటులోకి వ‌చ్చింది, స్పీడ్‌లు ఎలా ఉన్నాయి అనే ఇతర వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఆ విష‌యాల్ని మేం ఇక్క‌డ అందిస్తున్నాం. మీరు కూడా ఓ లుక్కేయండి.

airtel

భారతి Airtel 5G ప్లస్ నగరాలు:
దేశంలోని ఎనిమిది నగరాల్లో 5జీ ప్లస్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ఆ న‌గ‌రాల జాబితాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్ మరియు వారణాసి న‌గ‌రాలు ఉన్నాయి. మీరు ఈ నగరాల్లో దేనిలోనూ లేకుంటే, నిరుత్సాహపడకండి, ఎయిర్‌టెల్ తన 5G నెట్‌వర్క్‌ను దశలవారీగా దేశంలోని ఇతర ప్రాంతాలకు త్వ‌ర‌లోనే విస్తరిస్తుంది. మార్చి 2023 నాటికి Airtel 5Gతో భారతదేశంలోని చాలా పట్టణ నగరాలకు విస్త‌రించ‌నున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. మరియు మార్చి 2024 నాటికి దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలను క‌వ‌ర్ చేస్తామ‌ని పేర్కొంది.

భారతీ Airtel 5G ప్లస్ టారిఫ్‌లు:
Airtel యొక్క 5G ప్లస్ టారిఫ్‌లు ప్రస్తుతానికి 4G టారిఫ్‌ల మాదిరిగానే ఉండబోతున్నాయి. ప్రస్తుతం, అనుకూలమైన 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న వినియోగదారులు మరియు Airtel యొక్క 5G నెట్‌వర్క్ యొక్క కవరేజ్ జోన్‌లో ఉన్న వినియోగదారులు 4G ప్లాన్‌ల ధరతో మాత్రమే వేగవంతమైన 5G వేగాన్ని ఆస్వాదించగలరు.

airtel

థాంక్స్ యాప్‌లో చెక్ చేసుకోండి:
మీరు ఎయిర్‌టెల్ 5G నెట్‌వ‌ర్క్ అందుబాటులో ఉన్న నగరంలో ఉన్నారా అనే విష‌యాన్ని మీరు Airtel థాంక్స్ యాప్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత మీరు 5జీ నెట్‌వ‌ర్క్ సిటీ ప‌రిధిలో ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవ‌డానికి ఓ ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయ‌డం ద్వారా మీకు నెట్‌వ‌ర్క్ వినియోగానికి అర్హులా కాదా అనేది నిర్దార‌ణ అవుతుంది.

భారతీ Airtel 5G స్పీడ్:
ఎయిర్‌టెల్ మధ్యస్థ 5G డౌన్‌లోడ్ స్పీడ్ డేటాను ఓక్లా షేర్ చేసింది. ఎయిర్‌టెల్ యొక్క 5G నెట్‌వర్క్‌ 516 Mbps వరకు మధ్యస్థ డౌన్‌లోడ్ స్పీడ్‌ని అందించాయని ఊక్లా నివేదిక సూచిస్తుంది. కానీ, ఆ స్పీడ్ అనేది నెట్‌వ‌ర్క్ ప‌రిధి మ‌రియు డివైజ్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది.

airtel

జియో కూడా ఇప్ప‌టికే నాలుగు న‌గ‌రాల్లోకి ఎంట్రీ!
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ Jio కూడా తన 5G సేవల విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసింది. భారతదేశంలోని నాలుగు నగరాల్లో 5జీ సేవ‌లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ నగరాల్లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు వారణాసి ఉన్నాయి. ఈ నగరాల్లో Jio సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసిన సబ్‌స్క్రైబర్‌లు 5G సేవలను ఉప‌యోగించుకోగ‌ల‌రు అని పేర్కొంది. జియో 5జీ సేవ‌ల‌కు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అర్హ‌త క‌లిగిన‌ వినియోగ‌దారుల‌కు ఇన్విటేష‌న్ పంపుతుంది. MyJio యాప్ ద్వారా కస్టమర్‌లకు జియో 5జీ సేవ‌ల ఇన్విటేష‌న్ అందుతుంది. ఇన్విటేష‌న్ రాని వినియోగదారులు తమ ఫోన్‌లలో MyJio యాప్‌ని ఓపెన్ చేసి, 5జీ సేవ‌ల‌కు సంబంధించి తమకు ఇన్విటేష‌న్ చెక్ చేసుకోవాలి.

Jio 5Gకి ఈ కనీస రీఛార్జ్ ప్లాన్ అవసరం:
5G సేవలను ఉపయోగించడానికి చందాదారులు తమ ప్రస్తుత 4G SIM కార్డ్‌ని అప్‌గ్రేడ్ చేయనవసరం లేదని కంపెనీ స్పష్టం చేసినప్పటికీ, కనీస రీఛార్జ్ ప్లాన్‌పై షరతు ఉంది. ముఖ్యంగా, చందాదారులు కనీసం రూ.239తో రీఛార్జ్ చేసుకోవాలి. Jio 5G వెల్‌కమ్ ఆఫర్ ప్రయోజనాలను పొందడానికి రూ.239 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జీ చేసుకోవాలి. ఇది గరిష్టంగా 1Gbps వేగాన్ని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel 5G Available Cities, Tariffs and Speeds in the country

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X