Airtel నుంచి 5G సేవ‌ల విస్త‌ర‌ణ ప్రారంభం ఎప్పుడో తెలుసా!

|

టెలికాం కంపెనీలు గ‌త కొద్ది నెల‌లుగా ఉత్కంఠ‌గా ఎదురుచూసిన 5G స్పెక్ట్రం వేలం ఎట్ట‌కేల‌కు ముగిసింది. కాగా, ప్ర‌ధాన టెలికాం ఆప‌రేట‌ర్లు 5G నెట్‌వ‌ర్క్‌ను దేశ‌వ్యాప్తంగా ఈ ఏడాది ముగిసేలోపు లాంచ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. మ‌రోవైపు Airtel కంపెనీ మాత్రం తన 5G నెట్‌వర్క్‌ను ఆగ‌స్టులో ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. ఈ కంపెనీ 19,868 MHz ఎయిర్‌వేవ్స్ కోసం వేలంలో రూ.43,084 కోట్లను Airtel వెచ్చించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే, ఇప్పుడు 5G సేవ‌ల రోల్ అవుట్ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

 
Airtel నుంచి 5G సేవ‌ల విస్త‌ర‌ణ ప్రారంభం ఎప్పుడో తెలుసా!

Airtel 5G నెట్‌వ‌ర్క్ లాంచ్‌:
Airtel కంపెనీ ఈ నెలలో 5G నెట్‌వర్క్‌లను అమలు చేయడం ప్రారంభించడానికి నోకియా, ఎరిక్సన్ మరియు శాంసంగ్‌లతో ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రకటించింది. ఈ ప‌రిణామాల‌ను చూస్తే.. ఎయిర్‌టెల్ 5G సేవలను అత్యంత త్వరలో ప్రారంభిస్తుందని యూజ‌ర్లు ఆశించవచ్చు. స్పెక్ట్రమ్ వేలంలో ఎయిర్‌టెల్ 900MHz, 1800MHz, 2100MHz, 3300MHz మరియు 26GHz ఫ్రీక్వెన్సీలలో 19867.8MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం Airtel రూ.43,084 కోట్లను వెచ్చించింది.

అత్య‌ధిక ఇంటర్నెట్ వేగం, భారీ డేటా హ్యాండ్లింగ్ సామర్థ్యాలు మరియు జాప్యం లేకుండా 5G సేవలను త్వరిత‌గ‌తిన‌ రోల్ అవుట్ చేయడానికి భాగ‌స్వాముల‌ను ఏర్ప‌ర‌చుకున్నామ‌ని.. వారు ఆ దిశ‌గా కృషి చేస్తారని టెల్కో పేర్కొంది.

Airtel నుంచి 5G సేవ‌ల విస్త‌ర‌ణ ప్రారంభం ఎప్పుడో తెలుసా!

5జీ కోసం ఎయిర్‌టెల్ భాగ‌స్వామ్యం:
టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ ఆగస్టు 2022లో 5G విస్తరణ కోసం ఎరిక్సన్, నోకియా మరియు శామ్‌సంగ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సేవలు మరియు కనెక్టివిటీ ప‌రంగా ఎయిర్‌టెల్ ఇప్ప‌టికే నోకియా, ఎరిక్సన్ కంపెనీల‌తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కలిగి ఉంది. కానీ, శాంసంగ్‌తో భాగస్వామ్యం మాత్రం ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి మరియు ఇది భారతదేశంలో 5G నెట్‌వర్క్‌ని వేగవంతం చేయడంలో ఎయిర్‌టెల్‌కు సహాయపడటానికి ఉద్దేశించబడింది.

Airtel నుంచి 5G సేవ‌ల విస్త‌ర‌ణ ప్రారంభం ఎప్పుడో తెలుసా!

ఇదిలా ఉండ‌గా.. రిల‌య‌న్స్ జియో టెలికాం కంపెనీకి సంబంధించిన 5G రోలవుట్ గురించి ఇప్ప‌టికే ఆ కంపెనీ ఛైర్మ‌న్ ఆకాశ్ అంబానీ కీల‌క సూచ‌న‌లు చేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం.
రిలయన్స్ జియో చైర్మన్ గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన ఆకాష్ అంబానీ 5G రోల్‌అవుట్‌కి సంబందించి కొన్ని వివరాలను విడుదల చేసారు. "మేము పాన్ ఇండియా 5G రోల్‌అవుట్‌తో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ని జరుపుకుంటాము. అలాగే ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా సరసమైన ధరలోనే 5G మరియు 5G-ఎనేబుల్డ్ సేవలను వినియోగదారులకి అందించడానికి కట్టుబడి ఉంది." అని ఆకాశ్ ప్రకటన చేసారు.

భారతదేశంలో 5G నెట్‌వర్క్‌ కోసం జరిగిన వేలంలో జియో తన యొక్క 5G సేవలను విస్తృతంగా విడుదల చేయడానికి 24,740 MHz ఎయిర్‌వేవ్స్ కోసం రూ. 88,078 కోట్లు వెచ్చించి స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఈ స్పెక్ట్రమ్ వేలంలో జియో టెలికాం సంస్థ 5G సేవల కోసం అధికంగా రూ.88,078 కోట్లకు పైగా వెచ్చించి.

Airtel నుంచి 5G సేవ‌ల విస్త‌ర‌ణ ప్రారంభం ఎప్పుడో తెలుసా!

భారతదేశంలో నిర్వహించిన మొట్టమొదటి తాజా 5G స్పెక్ట్రమ్ వేలంలో మొత్తం 5G ఎయిర్‌వేవ్స్ స్పెక్ట్రమ్‌లో 71 శాతం కోసం 1,50,173 కోట్ల రూపాయల విలువైన బిడ్‌లను చూసింది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 72,098 MHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయగా అందులో 51,236 MHz విక్రయించబడింది. రిలయన్స్ జియో మొత్తం 22 సర్కిల్‌లలో 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడానికి వీలుగా కంపెనీ 700MHz, 800MHz, 1800MHz, 3300MHz మరియు 26GHz బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ హక్కును పొందింది. రిలయన్స్ జియో భారతదేశం అంతటా 5G సేవలను అందించే ఏకైక ఆపరేటర్‌గా 700 MHz స్పెక్ట్రమ్ ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Airtel 5G Network To Be Launched In India In August

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X