Home
News

బ్రాడ్‌బ్యాండ్ రంగం యొక్క ఆసక్తి పోరులో గెలుపు ఎవరిది?

కొద్ది రోజులలో రిలయన్స్ జియో తన గిగా ఫైబర్ FTTH సర్వీస్ ను భారత ప్రజల కోసం ప్రకటించబోతోంది. రిలయన్స్ జియో గిగాఫైబర్ యొక్క వాణిజ్య ప్రయోగానికి సంబంధించిన హైప్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రజలు దాదాపు ఒక సంవత్సరం నుండి ఈ సర్వీస్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరకు ఆగస్టు 12 న రిలయన్స్ జియో యొక్క 42 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో గిగా ఫైబర్ ను ప్రారంభించనున్నారు.

airtel act fibernet comparison

రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి అడుగు పెడుతుండడంతో ఈ రంగంలో పోటీ మరింత పెరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇతర సర్వీసు ప్రొవైడర్లు ఎక్కువ మంది చందాదారులను లక్ష్యంగా పెట్టుకున్నారు . దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని కంపెనీలు తమ వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లు మరియు సర్వీస్ యొక్క అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి.

airtel act fibernet comparison

బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను పొందేటప్పుడు వినియోగదారులు ఇష్టపడే రెండు అతి పెద్ద అగ్రశ్రేణి కంపెనీలు ACT ఫైబర్‌నెట్ మరియు ఎయిర్‌టెల్ V-ఫైబర్. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది మంచి ఎంపిక? తెలుసుకోవడానికి కింద చదవండి.

ACT ఫైబర్నెట్:

ACT ఫైబర్నెట్:

ఆసక్తిగల చందాదారులు ACT ఫైబర్నెట్ అందిస్తున్న ప్రణాళికలను పరిశీలిస్తే FUP పరిమితి మరియు డేటా స్పీడ్ విషయానికి వస్తే ACT ఫైబర్నెట్ 1,000 రూపాయల పరిధికి మించి కొన్ని అదనపు బ్రాడ్బ్యాండ్ ప్రణాళికలను అందిస్తుందని అందరు అనుకోవచ్చు. ACT ఫైబర్నెట్ కూడా 685 రూపాయల నుండి గొప్ప ప్రణాళికలను కలిగి ఉంది. ఇది 1 Gbps స్పీడ్ తో అందించే GIGA ప్లాన్ ధర 5,999 రూపాయల వరకు కూడా ఉన్నాయి. ACT ఫైబర్నెట్ నుండి వచ్చిన 959 రూపాయల ప్రణాళిక 50 MBbps స్పీడ్ తో 240GB డేటాను మరియు 1500GB అదనపు డేటాను ఒక నెలకు అందిస్తుంది. ACT ఫైబర్నెట్ నుండి వచ్చే 100 Mbps ప్లాన్లు 1,159 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. ఇది 400GB డేటా మరియు 1500GB అదనపు డేటాతో వస్తుంది. అదేవిధంగా ACT ఫైబర్‌నెట్‌లో 125 Mbps స్పీడ్ మరియు 150 Mbps స్పీడ్ అందించే ప్లాన్‌లు కూడా ఉన్నాయి. వీటి యొక్క ధర సుమారు 1,399 రూపాయలు మరియు 1,999 రూపాయలు.

అదనపు ప్రయోజనాలు అందించే  ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు:

అదనపు ప్రయోజనాలు అందించే ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు:

యాక్ట్ ఫైబర్‌నెట్ ప్లాన్‌లలో రూ .1,159, రూ .1,399, రూ .1,999 మరియు రూ .5,999 ప్లాన్‌తో వచ్చే అదనపు ప్రయోజనం మరియు ఆఫర్‌ల విషయానికి వస్తే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లో 350 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ACT ఫైబర్‌నెట్ చందాదారులకు సెమీ మరియు వార్షిక చందా లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ తో రీఛార్జ్ చేసినప్పుడు ఒక నెల ఉచిత చందా పొందే అవకాశం ఉంటుంది.

 ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు:

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు:

ACT ఫైబర్‌నెట్ మాదిరిగా కాకుండా ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ తన చందాదారులకు పరిమిత కాల ప్రణాళికలను అందిస్తుంది. ఇవి రూ .799 నుండి 1,999 రూపాయల వరకు వివిధ రకాల ప్లాన్లలో ఉంటాయి. రూ.799 ప్లాన్‌లో 40 Mbps స్పీడ్ తో 100GB డేటా, 200 GB అదనపు డేటాను ఆరు నెలల పాటు అందిస్తుంది. కానీ ఈ ప్రణాళికతో చందాదారులు ఎటువంటి ఎయిర్‌టెల్ థాంక్స్ యొక్క ప్రయోజనాలను పొందరు.

అదనపు ప్రయోజనాలు అందించే ప్రణాళికలు:

అదనపు ప్రయోజనాలు అందించే ప్రణాళికలు:

1,099 రూపాయలు, 1,599 రూపాయలు 1,999 రూపాయల ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కోసం వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలను ఆస్వాదించగలుగుతారు. ఇందులో భాగంగా ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం, మూడు నెలల పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ చందా, ఎయిర్‌టెల్ టివి ప్రీమియం మరియు ZEE5 సుబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ యొక్క 6 నెలల మరియు 12 నెలల ప్రణాళికల చందాపై వినియోగదారులకు వరుసగా 7.5% మరియు 15% తగ్గింపు లభిస్తుంది. ఈ అదనపు ప్రయోజనాల విషయంలో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు ACT ఫైబర్నెట్ కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి.

తీర్పు:

తీర్పు:

ఒకవేళ మీరు హై-స్పీడ్ డేటాను యాక్సెస్ చేయాలనుకునే వారు మరియు ఒక నెలకు అధిక మొత్తంలో డేటాను వినియోగించే వారు ACT ఫైబర్నెట్ కనెక్షన్ పొందడం సరైన ఎంపిక అవుతుంది. అయితే మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ మరియు నెట్‌ఫ్లిక్స్‌ను కలిగి ఉన్న ఉచిత ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం ఎయిర్‌టెల్ V-ఫైబర్ ఉత్తమం. ఎయిర్‌టెల్ 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో అపరిమిత డేటాను అందించే 1,999 రూపాయల అపరిమిత డేటా ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలతో కూడా వస్తుంది. మీరు ఈ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క ఈ ప్రణాళికలు ఏవీ మీ అవసరాలకు తగినట్లుగా అనిపించకపోతే రిలయన్స్ జియో గిగా ఫైబర్ ప్రారంభం వరకు వేచి ఉండాలని మేము సూచిస్తున్నాము. ఇది ట్రిపుల్ ప్లే ప్లాన్‌ను డిటిహెచ్, ల్యాండ్‌లైన్ మరియు బ్రాడ్‌బ్యాండ్‌తో నెలకు రూ .600 చొప్పున అందించే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
airtel act fibernet comparison
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X