ఎయిర్‌టెల్ అలర్ట్ సర్వీస్!

By Prashanth
|
Airtel Alert Service


న్యూఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాల సమయంలో తామెక్కడున్నదీ, తమ వారికి తెలియజేసే ఎమర్జెన్సీ అలర్ట్ సర్వీస్‌ను అందిస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. ఏదైనా విపత్తులో చిక్కుకున్నప్పుడు తామున్న భౌగోళిక ప్రదేశానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ బంధుమిత్రుల్లో ముఖ్యులైన 10 మందికి మెసేజ్ పంపవచ్చు. ఈ సేవలను సబ్‌స్రైబ్ చేసుకోవాలంటే నెలరోజులకు 30 రూపాయలు చెల్లించాలి. వినియోగదారులు ఈ సేవలు పొందాలనుకుంటే 55100 నంబర్‌కు కాల్ చేయడం గాని, ఏఉఔ్క అని 55100 నంబర్‌కు మెసేజ్ గాని పంపించాల్సి ఉంటుంది. కనీస బ్యాలెన్స్ లేకున్నా ఎమర్జెన్సీ అలర్ట్‌ను పంపించవచ్చని ఎయిర్‌టెల్ వివరించింది.

 

ఎయిర్‌టెల్ ‘స్మార్ట్ డ్రైవ్’

ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గమ్యస్థానానికి తడబడకుండా చేరుకోవటం.. వెళ్లే దారిలో ట్రాఫిక్ అప్‌డేట్‌ను ముందుగానే తెలుసుకోవటం వంటి విశేషాలతో కూడిన ‘స్మార్ట్ డ్రైవ్’ మొబైల్ అప్లికేషన్‌ను ప్రముఖ టెలికామ్ ప్రొవైడర్ ఎయిర్‌టెల్ ఆవిష్కరించింది. యూజర్ తన మొబైల్‌లో ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసకున్నట్లయితే రూట్ అడ్ర‌‌స్‌లతో పాటు ట్రాఫిక్ సమాచారాన్ని వాయిస్ ఆధారితంగా తెలుసుకోవచ్చు. దేశంలో ఈ ‘రియల్ టైమ్ నేవిగేషన్’ సర్వీస్‌ను ప్రారంభించిన ఏకైక సంస్థగా తాము గుర్తింపు పొందినట్లు ఎయిర్‌టెల్ వర్గాలు ఒ ప్రకటనలో పేర్కొన్నాయి.

 

ఈ అప్లికేషన్‌ను పొందాలనుకునే సదరు ఎయిర్‌టెల్ వినియోగదారు తన మొబైల్ ద్వారా ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎయిర్‌టెల్‌లైవ్.కామ్/స్మార్ట్‌డ్రైవ్’’లోకి లాగినై డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ‘‘స్మార్ట్’’ అని టైప్ చేసి ‘543221’కి ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్ ను నెల మొత్తం పొందాలనుకున్న వారు నెలసరి ప్యాక్ కింద రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. ఒక రోజు అప్‌డేట్ కోసం రూ.3 చెల్లించాల్సి ఉంది. టర్న్ బై టర్న్ నేవిగేషన్ అప్లికేషన్‌ను నెల మొత్తం ఉపయోగించుకోవాలనుకునే వారు నెలసరి ప్యాక్ కింద రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. డైలీ ప్యాక్ విలువ రూ.10. ఆండ్రాయిడ్, సింబియాన్, బ్లాక్‌బెర్రీ ఇంకా విండోస్ ప్లాట్‌ఫామ్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X