Home
News

జియో పైబర్ లాంచ్ చేయకముందే ఎయిర్‌టెల్ కౌంటర్

దేశీయ టెలికాం మార్కెట్లో వార్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

By Hazarath Aiah

దేశీయ టెలికాం మార్కెట్లో వార్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రిలయన్స్ జియో ఎయిర్‌టెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వార్ నడుస్తోంది. ఈ వార్ ఇప్పుడు టెలికాం రంగాన్ని దాటి బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి పాకింది.ఈ నేపథ్యంలోనే జియో పైబర్ లాంచ్ చేయకముందే ఎయిర్‌టెల్ కౌంటర్ వేసింది. రిలయన్స్‌ జియో తన గిగాఫైబర్‌ బ్యాండ్‌ సర్వీసులను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో, భారతీ ఎయిర్‌టెల్‌ తన హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లపై అపరిమిత డేటా

బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లపై అపరిమిత డేటా

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు కొన్ని బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లపై అపరిమిత డేటాను వాడుకోవచ్చని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. దీని కోసం ఫేర్‌ యూసేజ్‌ పాలసీ డేటా పరిమితిని ఎయిర్‌టెల్‌ తొలగించేస్తున్నట్టు పేర్కొంది.

ఫేస్‌ యూసేజ్‌ పాలసీ డేటా

ఫేస్‌ యూసేజ్‌ పాలసీ డేటా

20కి పైగా కీలక మార్కెట్లలో ఎంపిక చేసిన నెలవారీ హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లపై ఉన్న ఫేస్‌ యూసేజ్‌ పాలసీ డేటా పరిమితిని తొలగిస్తున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. దీంతో కస్టమర్లకు అపరిమిత డేటా లభించనుంది.

అపరిమిత హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను..

అపరిమిత హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను..

ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌కు మాత్రమే అపరిమిత హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేసేది. దీన్ని ఇతర మేజర్‌ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది.

300ఎంబీపీఎస్‌ వరకు స్పీడ్‌

300ఎంబీపీఎస్‌ వరకు స్పీడ్‌

గత నెలలో 300ఎంబీపీఎస్‌ వరకు స్పీడ్‌ ఉన్న హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ఎంపిక చేసుకున్న వారికి ఆరు నెలలు, ఏడాది పాటు 15 శాతం, 20 శాతం డిస్కౌంట్లను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌చేసింది.

జియో గిగాఫైబర్‌ సర్వీసులు

జియో గిగాఫైబర్‌ సర్వీసులు

ఎయిర్‌టెల్‌ అపరిమిత హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ డేటా ప్లాన్లను, కరెక్ట్‌గా జియో గిగాఫైబర్‌ సర్వీసులు మార్కెట్‌లోకి వచ్చే సమయంలో ఆఫర్‌ చేస్తోంది.

ఆగస్టు 15 నుంచే..

ఆగస్టు 15 నుంచే..

ఆగస్టు 15 నుంచే రిలయన్స్‌ జియో తన అప్‌కమింగ్‌ గిగాఫైబర్‌ బ్యాండ్‌ సర్వీసుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. కేవలం రూ.500కే హై-స్పీడ్‌, వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను ఇంటర్నెట్‌ ఆధారిత టెలివిజన్‌ ప్రొగ్రామింగ్‌ ఆధారితంగా అందిస్తోంది.

ఎయిర్‌టెల్‌ చెప్పిన వివరాల ప్రకారం..

ఎయిర్‌టెల్‌ చెప్పిన వివరాల ప్రకారం..

ఎయిర్‌టెల్‌ చెప్పిన వివరాల ప్రకారం..ముంబైలో 699 రూపాయలు, 1,999 రూపాయల ప్లాన్లు, అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, జమ్నాగర్‌లో 499 రూపాయలు, 599 రూపాయలు, 1,099 రూపాయల ప్లాన్లు
చంఢీఘర్‌, ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, ఘజియాబాద్‌, జైపూర్‌, ఇండోర్‌, కోల్‌కత్తాల్లో 1,999 ప్లాన్‌, ఆగ్రా, అంబాలా, కర్నల్‌ల్లో 499 రూపాయలు, 1,999 రూపాయల ప్లాన్లలో అపరిమిత డేటా లభించనుంది.

ఒకవేళ కస్టమర్లకు అవసరమైతే..

ఒకవేళ కస్టమర్లకు అవసరమైతే..

ఎయిర్‌టెల్‌ మొత్తం హోమ్‌ బ్రాండ్‌ నెట్‌వర్క్‌ ప్రస్తుతం వి-ఫైబర్‌ ఆఫర్‌ చేస్తుంది. దీని కింద 300 ఎంబీపీఎస్‌ స్పీడులో డేటా లభ్యవుతుంది. ఒకవేళ కస్టమర్లకు అవసరమైతే, 1 జీబీపీఎస్‌ స్పీడుకు అప్‌గ్రేడ్‌ చేస్తాం' అని ఎయిర్‌టెల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు.

89 ప్రాంతాల్లో..

89 ప్రాంతాల్లో..

ప్రస్తుతం 89 ప్రాంతాల్లో ఉన్న బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను కనీసం 100 కీ నగరాలకు విస్తరించేందుకు ఆర్థిక సంవత్సరం 2019 కోసం రూ.24వేల కోట్లను పక్కన తీసి పెట్టినట్టు మరో సీనియర్‌ ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు.

10 మిలియన్‌ పైగా గృహాలకు

10 మిలియన్‌ పైగా గృహాలకు

2021 వరకు మరో 10 మిలియన్‌ పైగా గృహాలకు తమ నెట్‌వర్క్‌ను కనెక్ట్‌ చేయాలని ఎయిర్‌టెల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు 2.4 మిలియన్‌ యాక్టివ్‌ వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు ఉన్నారు.

Best Mobiles in India

English summary
Ahead of Jio GigaFiber launch, Airtel allows unlimited usage on some broadband plans More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X