ఎయిర్‌టెల్-అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఆఫర్ గురించి మీకు తెలియని విషయాలు

|

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో భారతదేశవ్యాప్తంగా ఉన్న తన యొక్క వినియోగదారులకు అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. వోడాఫోన్ ఐడియా మరియు రిలయన్స్ జియోతో పోల్చినప్పుడు ఈ టెల్కో చాలా పోటీతత్వ ప్లాన్‌లను అందిస్తోంది. అలాగే ఇప్పుడు వినియోగదారులకు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందించే అదనపు ప్రయోజనాలపై కూడా టెల్కో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రాథమిక ప్రయోజనాలతో పాటు టెలికాం ఆపరేటర్లు అదనపు ప్రయోజనాలను పెంచడంపై కూడా దృష్టి పెట్టారు.

 

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ సంస్థ అదే చేయడానికి ప్రయత్నిస్తూ ఎయిర్‌టెల్ థాంక్స్‌తో ఒక అడుగు ముందుకు వేసింది. ఎయిర్‌టెల్ థాంక్స్ అనేది భారతీ ఎయిర్‌టెల్ అందించే అధిక ప్రయోజనాల సమూహం. ఇది టెల్కో నుండి అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే ప్రతి కస్టమర్‌లకు విస్తరించబడుతుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యొక్క ప్రయోజనాలలో వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు. ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ - అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ పరిమిత కాల ఆఫర్

ఎయిర్‌టెల్ - అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ పరిమిత కాల ఆఫర్

ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారులకు అందించే అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్రయోజనం ఒకే ఒక స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే పనిచేస్తుంది. భారతీ ఎయిర్‌టెల్ నుండి లభించే దాదాపు అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. టెల్కో ద్వారా వినియోగదారులకు అందించే ఉచిత సబ్‌స్క్రిప్షన్ 1 నెల మాత్రమే చెల్లుబాటు అవుతుందని గమనించండి. అయితే ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లు అమెజాన్ ప్రైమ్ వీడియో మెంబర్‌షిప్ ను ఉచితంగా పొందవచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్ ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్ యొక్క సాధారణ సభ్యత్వాన్ని అందిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్
 

అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్రయోజనంతో లభించే ప్లాన్ రూ.349 ధర వద్ద వస్తుంది. ఇది 28 రోజుల స్వల్ప వ్యాలిడిటీతో వస్తుంది. ఇది వినియోగదారులకు 2.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను స్వతంత్ర చందా వలె కొనుగోలు చేయలేము. ఇది అమెజాన్ బాహ్య భాగస్వాముల ద్వారా మాత్రమే వినియోగదారులకు అందించబడుతుంది. భారతదేశానికి సంబంధించి ఆ భాగస్వామి భారతి ఎయిర్‌టెల్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా మొబైల్-ఓన్లీ ప్లాన్‌ను ప్రారంభించడానికి అమెజాన్ జనవరిలో ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది టెల్కో యొక్క చందాదారుల అదనపు లక్ష్యాన్ని ఎంత సానుకూలంగా ప్రభావితం చేసిందో చెప్పడానికి మార్గం లేదు.

ఎయిర్‌టెల్ రూ.6,000 క్యాష్ బ్యాక్ ఆఫర్

ఎయిర్‌టెల్ రూ.6,000 క్యాష్ బ్యాక్ ఆఫర్

భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతం తన యొక్క వినియోగదారులకు అందించే రూ.6,000 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని 36 నెలల వ్యవధిలో రెండు భాగాలుగా అందిస్తుంది. రూ.249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్యాక్‌తో 18 నెలలపాటు నిరంతర రీఛార్జ్‌లను పూర్తి చేసినప్పుడు మొదటి క్యాష్‌బ్యాక్ రూ.2,000 వినియోగదారులకు అందించబడుతుంది. ఇంకా రూ.249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 36 నెలల రీఛార్జి పూర్తి చేసిన తర్వాత రూ.4,000 మిగిలి మొత్తం వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ రూపంలో అందించబడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఎయిర్‌టెల్ సంస్థ తన యొక్క వినియోగదారులకు రూ.4,800 విలువైన ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్రయోజనాన్ని కూడా కస్టమర్‌లకు అందిస్తోంది. రూ.12,000 లోపు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం స్క్రీన్ రీప్లేస్ చేయడానికి సుమారుగా అయ్యే ఖర్చు రూ .4,800. దీనిని ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచితంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ - డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌

ఎయిర్‌టెల్ - డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌

ఎయిర్‌టెల్ టెల్కో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ లైబ్రరీకి అపరిమిత మరియు ఉచిత యాక్సెస్‌తో వస్తాయి. ఇందులో 100,000 గంటల ఆకర్షణీయమైన కంటెంట్ మరియు IPL మరియు T20 వరల్డ్ కప్ వంటి గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్‌ల లైవ్ కవరేజ్ ఉన్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్‌ల లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు ఈ కొత్త ఎయిర్‌టెల్ ప్లాన్‌లు ఎనిమిది స్థానిక భాషలలో కొత్త హాట్‌స్టార్ స్పెషల్ సిరీస్‌లు, హాట్‌స్టార్ మల్టీప్లెక్స్ బ్యానర్‌లో విడుదలైన సినిమాలు, డిస్నీ లైబ్రరీ టైటిల్స్, డిస్నీ+ ఒరిజినల్స్ మరియు స్టార్ ఇండియా నెట్‌వర్క్ యొక్క టీవీ షోల విస్తృత టీవీ ప్రీమియర్లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి.ఎయిర్‌టెల్ కొత్తగా ప్రారంభించిన మొదటి ప్లాన్ రూ.499 ధర వద్ద లభించే ప్లాన్ యొక్క పూర్తి వివరాల విషయానికి వస్తే ఇది వినియోగదారులకు రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMS మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచిత యాక్సెస్‌ మరియు షా అకాడమీ కోర్సులకు ఉచిత యాక్సెస్ తో పాటుగా 3 నెలల అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్ అందిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel- Amazon Prime Mobile Edition Free Offer: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X