Home
News

భారత్‌లోనూ శాటిలైట్‌ ఇంటర్నెట్.. SpaceX తో ఎయిర్‌టెల్‌ కీలక ఒప్పందం..!

శాటిలైట్ ఇంటర్నెట్‌ (Satelite Internet) రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థతో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel and SpaceX Deal) ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా స్టార్‌లింక్‌ ఉపగ్రహాల ద్వారా భారత్‌లో తన వినియోగదారులకు ఎయిర్‌టెల్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తుంది. ఫలితంగా భూమి మీద ఉన్న నెట్‌వర్క్‌ టవర్స్‌తో సంబంధం లేకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఎయి‌ర్‌టెల్‌, స్పేస్‌ఎక్స్‌ ఒప్పందం :
భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలకు (SpaceX services in india) అనుమతులు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులకు లోబడే డీల్‌ ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. దీంతోపాటు ఎయి‌ర్‌టెల్‌, స్పేస్‌ఎక్స్‌ పరస్పరం సహకరించుకోనున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాల్లో స్టార్‌లింక్‌ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందిస్తోంది.

Airtel and elon musk s spaceX deal

హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ :
భూ దిగువ కక్ష్యలోని శాటిలైట్‌ల ద్వారా స్టార్‌లింక్‌ తన సేవలను అందిస్తోంది. ఇందుకోసం భారీ సంఖ్యలో ఉపగ్రహాలను స్టార్‌లింక్‌ కలిగి ఉంది. దేశవ్యాప్తంగా పూర్తిగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లోనూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్‌ ఒప్పందంలో భాగంగా.. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్ విస్తరించేందుకు, నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు స్టార్‌లింక్ సాయం చేస్తుంది. అలాగే ఎయిర్‌టెల్‌ స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలను అందించడం, ఎయిర్‌టెల్‌ ద్వారా స్టార్‌లింక్ సేవలు.. స్కూల్స్‌, హెల్త్‌ సెంటర్‌లు, కమ్యూనిటీలకు అనుసంధాం చేసే అవకాశాలను అన్వేషిస్తాయి. భారత్‌లో ఎయిర్‌టెల్ మౌలిక సదుపాయాలు సహా ఇతర వనరులను ఉపయోగించుకుంటుంది.

కీలక మైలురాయి! :
ఎయిర్‌టెల్‌, స్పేస్‌ఎక్స్‌ ఒప్పందంపై ఇరు సంస్థలు సంతోషం వ్యక్తం చేశాయి. భారత్‌లో ఎయిర్‌టెల్‌ కస్టమర్‌లకు స్టార్‌లింక్‌ ద్వారా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కీలక మైలురాయి అని భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్షర్‌, వైస్ ఛైర్మన్‌ గోపాల్‌ విట్టల్‌ తెలిపారు.

స్పేస్‌ఎక్స్ సహకారంతో దేశంలోని మారుమాలు, గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను తీసుకొచ్చే సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. నమ్మకమైన బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తామన్నారు.

ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంతో భారత ప్రజలకు స్టార్‌లింక్‌ ద్వారా సేవలు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని స్పేస్‌ఎక్స్‌ ప్రెసిడెంట్‌ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ గ్విన్నే షాట్‌వెల్‌ తెలిపారు. భారత టెలికాం రంగంలో ఎయిర్‌టెల్‌ కీలక పాత్ర పోషించిందని, వారితో కలిసి పనిచేసే అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేశారు.

భారత్‌లో స్పేస్‌ఎక్స్‌ సర్వీసులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే అనుమతులు ప్రక్రియ ఎక్కడ ఉందనే సమాచారం వెల్లడి కాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

స్టార్‌లింక్‌ ప్రస్తుతం 100 దేశాల్లో సేవలు అందిస్తోంది. అమెరికా, కెనడా, జర్మనీ, జపాన్‌, ఆస్ట్రేలియా, UK, మంగోలియా వంటి అనేక దేశాలున్నాయి. ఇటీవలే భూటాన్‌లోనూ స్టార్‌లింక్‌ ద్వారా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్‌లోనే సేవలు ప్రారంభించినా.. గత నెలలో అధికారికంగా వెల్లడించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel and elon musk's spaceX deal on satellite internet services in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X