నెట్‌ఫ్లిక్స్, 84రోజుల అన్‌లిమిటెడ్ కాలింగ్, హైస్పీడ్ డేటాతో జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌లు..!
ఓటీటీల వినియోగం ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఆయా సంస్థలు తమ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో తమ ఫోన్ రీఛార్జీలతోపాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉండే ప్లాన్లపై వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జియో, ఎయిర్‌టెల్ తన అనేక ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి నెట్‌ఫ్లిక్స్‌ను తొలగించింది.
అయితే జియో (Jio and Airtel prepaid plan with Netflix Subscription), ఎయిర్‌టెల్‌లో 84 రోజుల వ్యాలిడిటీ సహా నెట్‌ఫ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉంది. అన్‌లిమిటెడ్ డేటా సహా అపరిమిత కాలింగ్ సదుపాయాలతో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

జియో రూ.1099 ప్లాన్ వివరాలు :
జియో ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1099 తో 84 రోజల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తం 168GB డేటాను పొందవచ్చు. అంటే రోజులు 2GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. అనంతరం 64kbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిడెట్ కాలింగ్ సహా రోజుకు 100 SMS లను పొందవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా సినిమాలు సహా టీవీ షోలను వీక్షించవచ్చు. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. కుటుంబ సభ్యులు మినహా ఇతరులకు నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపేసిన నేపథ్యంలో ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1499.. 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. రోజుకు 3GB హైస్పీడ్ డేటా సహా అన్‌లిమిటెడ్ కాలింగ్, మెసెజ్‌లను పొందవచ్చు. దీంతోపాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.
దీంతోపాటు వింక్ మ్యూజిక్ మరియు ఉచిత హలో ట్యూన్లు, 3 నెలలపాటు అపోలో 24/7 సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఎక్కువగా డేటా వినియోగించుకొనే వాళ్లు సహా సినిమాలు సహా ఇతర టీవీషోలు చూసే ఈ ఎయిర్‌టెల్ రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే ఈ జియో, ఎయిర్‌టెల్ యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఈ రెండు ప్లాన్లలో నచ్చింది ఎంచుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు రెండు కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తున్నాయి. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉన్నాయి.
జియో ప్లాన్ తక్కువ ధరకే రూ.1099 అందుబాటులోకి వస్తున్నా.. మొబైల్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ మాత్రేమే కలిగి ఉంది. అంటే మొబైల్ లేదా ట్యాబ్లెట్‌లో మాత్రమే వినియోగించే వీలుంటుంది. అదే ఎయిర్‌టెల్ ప్లాన్ రూ.1499లో బేసిక్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అంటే ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, స్మార్ట్ టీవీలోనూ వినియోగించుకోవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








