ఎయిర్‌టెల్, జియో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు యూజర్లకు ఎంతమేర సహాయపడతాయి!!

|

ఇండియాలోని టెలికాం రంగంలో గల రెండు అతి పెద్ద టెలికాం సంస్థలు రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ కూడా ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఈ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇద్దరూ అతి పెద్ద మార్కెట్ వాటాను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా వారి యొక్క ఆదాయాలను పెంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. రిలయన్స్ జియో యొక్క లక్ష్యం భారతదేశాన్ని '2G ముక్త్' దేశంగా మార్చడం అని ఇప్పటికే చాలా సార్లు ప్రకటించింది. కానీ అలా చేయడానికి సరసమైన ధరలో లభించే అల్ట్రా 4G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండాలి.

జియోఫోన్

జియోఫోన్ యొక్క ఆఫర్లు బాగున్నాయి కానీ అవి అందరూ కోరుకున్నవి కావు. ఈ రోజు చాలా మంది వ్యక్తులు ఫీచర్ డివైజ్‌ చౌకగా ఉన్నప్పటికి దానిని కోరుకోవడానికి అధికంగా ఇష్టపడడం లేదు. రిలయన్స్ జియో నుండి త్వరలో రాబోతున్న జియోఫోన్ నెక్స్ట్ ఆఫర్ వినియోగదారులకు ఏవిధంగా సహాయపడి అది దేశానికి ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందో వంటి వివరాలు ముందు ముందు చూడాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL FTTH కొత్త ప్లాన్‌లతో యూజర్లకు అనేక OTTలకు ఉచిత యాక్సిస్....BSNL FTTH కొత్త ప్లాన్‌లతో యూజర్లకు అనేక OTTలకు ఉచిత యాక్సిస్....

భారతీ ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్

భారతీ ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్

రిలయన్స్ జియో నుండి వచ్చిన జియోఫోన్ ఆఫర్ భారతదేశాన్ని పూర్తిగా '2G ముక్త్' దేశంగా మార్చలేకపోయినది. అయితే ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్ అందించే స్మార్ట్‌ఫోన్ ఆఫర్ కూడా అదే పని చేయడంలో ఎంతవరకు సహాయపడుతుందో చూడాలి. ఎయిర్‌టెల్ యొక్క ఈ ఆఫర్ ప్రధానంగా కంపెనీకి గరిష్ట ఆదాయాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లను కనీసం రూ.249 ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేయడానికి మరియు స్మార్ట్‌ఫోన్‌ని పొందడానికి కారణంగా కూడా చూపుతున్నది. ఖర్చుల కారణంగా 2G/3G నెట్‌వర్క్‌లలో ఉన్న తక్కువ-ఆదాయ కస్టమర్‌లు 4G నెట్‌వర్క్‌లకు మారడానికి ప్రేరేపించబడరు.

స్మార్ట్‌ఫోన్‌

సాధారణ వినియోగదారులకు ఈ ఆఫర్లు చాలా వరకు ఉపయోగపడతాయి. జియోఫోన్ యొక్క ఈ కొత్త ఆఫర్ దేశంలో సానుకూల ప్రభావం చూపింది. ఎయిర్‌టెల్ ఆఫర్ రూ.10,000 పరిధిలో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయగల వినియోగదారులకు రూ.6,000 విలువైన క్యాష్‌బ్యాక్‌లను అందించడానికి ముందుకు వస్తోంది. ప్రస్తుతానికి అస్పష్టంగా ఉన్నది ఏమిటంటే ఈ క్యాష్‌బ్యాక్ అనేది వినియోగదారుడి యొక్క బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుందా లేదా రీఛార్జ్ ప్రయోజనాల రూపంలో లభిస్తుందా అని. జియో మరియు ఎయిర్‌టెల్ రెండూ చాలా ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఇవి చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది జియోఫోన్ నెక్స్ట్ కంపెనీ పుస్తకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. రెండు టెల్కోల యొక్క స్మార్ట్‌ఫోన్ ఆఫర్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు?

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతం తన యొక్క వినియోగదారులకు అందించే రూ.6,000 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని 36 నెలల వ్యవధిలో రెండు భాగాలుగా అందిస్తుంది. రూ.249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్యాక్‌తో 18 నెలలపాటు నిరంతర రీఛార్జ్‌లను పూర్తి చేసినప్పుడు మొదటి క్యాష్‌బ్యాక్ రూ.2,000 వినియోగదారులకు అందించబడుతుంది. ఇంకా రూ.249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 36 నెలల రీఛార్జి పూర్తి చేసిన తర్వాత రూ.4,000 మిగిలి మొత్తం వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ రూపంలో అందించబడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఎయిర్‌టెల్ సంస్థ తన యొక్క వినియోగదారులకు రూ.4,800 విలువైన ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్రయోజనాన్ని కూడా కస్టమర్‌లకు అందిస్తోంది. రూ.12,000 లోపు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం స్క్రీన్ రీప్లేస్ చేయడానికి సుమారుగా అయ్యే ఖర్చు రూ .4,800. దీనిని ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచితంగా అందిస్తుంది.

జియోఫోన్ నెక్స్ట్

రూ.4,000 (అంచనా) ధర వద్ద లభించే జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ గేమ్-ఛేంజర్ కావచ్చు. ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇండస్ట్రీని షేక్చేసే అవకాశం ఎంతగానో ఉంది. అలాగే ఇతర కంపెనీలు మెరుగైన స్పెసిఫికేషన్స్ మరియు సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌తో అదే రేంజ్‌లోని డివైజ్‌లతో బయటకు వచ్చేలా చేస్తుంది. ఒకవేళ జియో దీన్ని అందించడంలో విఫలమైతే కనుక కంపెనీ వాగ్దానాలపై ఇది బాగా కనిపించదు. అంతేకాకుండా తదుపరి దాని చందాదారుల బేస్‌పై కూడా నిజంగా ప్రభావం చూపదు. చాలా మంది వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను హాట్‌స్పాట్‌లు లేదా వాయిస్ కాల్‌ల కోసం ద్వితీయ పరికరంగా కూడా ఉపయోగించవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel and Jio Telco's New Smartphone Offer How Useful For Customers: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X