జియో, ఎయిర్‌టెల్ సంస్థలు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు పెంచనున్నాయి!! ప్రూఫ్ ఇదిగో...

|

రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ ప్రైవేట్ టెలికాం సంస్థలు ఇటీవల తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించాయి. ఈ ప్లాన్లలలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రోజువారీ పరిమితులు లేకుండా డేటాను వినియోగించడానికి వినియోగదారులను అనుమతించే స్వభావం. కానీ వినియోగదారులు మర్చిపోయిన విషయం కూడా ఉంది. అది ఏమిటంటే ఈ ప్లాన్లతో వినియోగదారులకు ప్రతి GB డేటా మీద అయ్యే ఖర్చు. ఇది ముందు ముందు ధరల పెంపు గురించి టెల్కోస్ పరోక్షంగా సంకేతం అయి ఉండవచ్చు. ఈ కొత్త ప్లాన్ లు వినియోగదారుల నుండి ప్రతి GB డేటాకు ఎంత మొత్తంలో డబ్బును వసూలు చేస్తున్నాయో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టెలికాం మార్కెట్‌లో ఖరీదైన ప్లాన్‌లతో రిలయన్స్ జియో

టెలికాం మార్కెట్‌లో ఖరీదైన ప్లాన్‌లతో రిలయన్స్ జియో

రిలయన్స్ జియో ఇప్పుడు తన వినియోగదారుల కోసం కొత్తగా ఐదు ప్లాన్‌లను విడుదల చేయగా ఎయిర్‌టెల్ ఒకే ఒక ప్లాన్‌ను మాత్రమే ప్రారంభించింది. కస్టమర్ల వద్ద నుండి జియో ఎంత మొత్తంలో అధికంగా వసూలు చేస్తుందో అర్థం చేసుకోవడానికి దాని యొక్క రెండు ప్లాన్‌లను ఎంచుకున్నాము. ఇందులో ఒకటి పాత ఆఫర్‌ల నుండి మరియు ఇంటోకి కొత్తగా ప్రారంభించిన వాటి నుండి తీసుకున్నాము.

జియో రూ.2,399 ప్లాన్‌ VS రూ.2,397 ప్లాన్‌

జియో రూ.2,399 ప్లాన్‌ VS రూ.2,397 ప్లాన్‌

రిలయన్స్ జియో రూ.2,399 ధర వద్ద అందించే పాత ప్లాన్‌ మరియు జియో కొత్తగా విడుదల చేసిన రూ.2,397 ప్లాన్‌ల మధ్య గల పోలికలను సరిగ్గా గమనిస్తే కనుక ఈ రెండు ప్లాన్‌లు 365 రోజుల చెల్లుబాటు, అపరిమిత కాలింగ్, రోజుకు 100SMS లు మరియు కాంప్లిమెంటరీ జియో యాప్ ప్రయోజనాలతో వస్తాయి. రిలయన్స్ జియో రూ.2,399 మరియు రూ.2,397 రెండు ప్లాన్‌ల మధ్య ఉన్న ప్రధాన తేడా విషయానికి వస్తే వాటి రోజువారి డేటా ప్రయోజనాలు. రూ.2,399 ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. అయితే కొత్తగా విడుదలైన రూ.2,397 ప్లాన్ మాత్రం వినియోగదారులకు ఎటువంటి రోజువారీ వినియోగ పరిమితులు లేకుండా మొత్తంగా 365GB డేటాను అందిస్తుంది.

జియో
 

రిలయన్స్ జియో అందించే రెండు ప్లాన్‌లను జాగ్రత్తగా పరిశీలించగా రూ.2,399 ప్లాన్‌తో యూజర్లు మొత్తం చెల్లుబాటు కాలానికి 730GB డేటాను పొందుతారు. అయితే రూ.2,397 ప్లాన్‌తో మాత్రం యూజర్లు అందులో సగం డేటాను కేవలం 365GB డేటాను మాత్రమే పొందుతారు . ఈ విధంగా చూసుకుంటే రూ.2,399 ప్లాన్‌తో ప్రతి 1GB డేటాకు వినియోగదారులకు రూ.3.28 ఖర్చు చేస్తున్నారు. అయితే రూ.2,397 ప్లాన్‌తో పోల్చితే వినియోగదారులకు ప్రతి 1GB డేటాను రూ.6.56 ఖర్చుతో పొందుతారు. ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ.

ఖరీదైన భారతి ఎయిర్‌టెల్ ప్లాన్‌లు

ఖరీదైన భారతి ఎయిర్‌టెల్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్‌ కూడా ఇప్పుడు కొత్తగా తన వినియోగదారులకు ఒక ప్లాన్ ను తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ సంస్థ రూ.456 ధర వద్ద కొత్తగా ఒక ప్లాన్‌ను విడుదల చేసింది. మేము దీనిని టెల్కో యొక్క పాత ఆఫర్ రూ.449 తో పోల్చాము. ఎయిర్‌టెల్ టెల్కో నుండి లభించే రూ.456 మరియు రూ.449 ప్లాన్‌లు రెండూ కూడా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, మరియు రోజుకు 100SMS లతో పాటుగా ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ఒటిటి ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ ప్లాన్‌ల మధ్య ఉన్న తేడా ఏమిటంటే వాటి వాలిడిటీ మరియు డేటా ప్రయోజనాలు. రూ.456 ధర వద్ద లభించే ప్లాన్ 60 రోజుల వాలిడిటీతో రాగా, రూ.449 ప్లాన్ 56 రోజుల స్వల్ప తేడా చెల్లుబాటుతో వస్తుంది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ యొక్క కొత్త రూ.456 ప్లాన్‌తో వినియోగదారులు 60 రోజుల పాటు రోజువారీ వినియోగ పరిమితి లేకుండా మొత్తంగా 50GB డేటాను పొందుతారు. అయితే పాత రూ.449 ప్లాన్‌తో యూజర్లు 56 రోజుల వాలిడిటీ కాలంలో 2GB రోజువారి డేటాను పొందుతారు. అంటే మొత్తం చెల్లుబాటు కాలానికి 112GB డేటాను పొందుతారు. కాబట్టి రూ.449 ప్లాన్‌తో యూజర్లు 1GB డేటాను సుమారు రూ.4 కు పొందుతారు, అయితే రూ.456 ప్లాన్‌తో యూజర్లు 1GB డేటాను రూ.9.12 ధర వద్ద పొందుతారు. ప్రతి డేటా ఖర్చులో ఇది గణనీయమైన జంప్.

కొత్త ప్లాన్‌లు

ఇప్పుడు ఈ కొత్త ప్లాన్‌లతో రెండు విషయాలను అర్ధం చేసుకోవచ్చు. ఇందులో ఒకటి ఇవి కేవలం భిన్నమైన ప్రకృతి ప్లాన్‌లు. ఇవి రోజువారీ డేటా వినియోగ పరిమితులతో రావు మరియు అందువల్ల అవి ఖరీదైనవి. రెండవది ఈ ప్లాన్‌లు టెలికాం పరిశ్రమ త్వరలో చూడబోయే ధరల పెరుగుదలను స్పష్టంగా చూపుతున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel and Jio Telcos Prepaid Plan Price Maybe Hike: Here are The Proof

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X