Home
News

మీరు 5G నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారా.. అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌..!!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో ఎయిర్‌టెల్‌, జియో 5G సేవలు అందిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దేశంలో 5G సర్వీసులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉచితంగానే 5G సేవలను అందిస్తున్నాయి. అంటే 4G ప్యాక్‌పైన అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.

త్వరలో 5G రీఛార్జ్‌ ప్యాక్‌లు : అయితే ఈ అన్‌లిమిటెడ్‌ డేటా సర్వీసులపై జియో, ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో 5G రీఛార్జ్‌ ప్యాక్‌లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తు్న్నారు. దాంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉచిత సేవలను నిలిపివేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

airtel-and-jio-may-introduce-5g-recharge-plans

5G రీఛార్జ్‌ ప్లాన్ల ధరలు పెరుగుతాయా? : 2024 సంవత్సరం రెండో భాగం నుంచి 5G సేవలకు ఛార్జీలు చేయవచ్చని భావిస్తున్నారు. 4G సేవలతో పోలిస్తే 5G రీఛార్జ్‌ ప్లాన్లు 5-10 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

5G నెట్‌వర్క్‌పైన పెట్టిన పెట్టుబడులను రాబట్టుకోవడం సహా ఇతర కార్యక్రమాల కోసం ప్రస్తుతం ఛార్జీలను 20 శాతం పెంచే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మరియు వోడాఫోన్‌ ఐడియా 5G నెట్‌వర్క్‌ను కలిగి లేవు.

మానిటైజేషన్‌ మరియు 5G కవరేజీ పెరుగుతున్న దృష్ట్యా జియో మరియు ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలు అన్‌లిమిటెడ్‌ 5G డేటా నిలిపివేసి, 5G సర్వీసుల కోసం ప్రత్యేక ప్లాన్లు తీసుకొచ్చే అవకాశం ఉందని జెఫరీస్‌ అనే సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మార్పులు 2024 సంవత్సరం రెండో భాగం నుంచి ఈ కొత్త నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని పేర్కొంది.

జియో, ఎయిర్‌టెల్‌ వంటి టెలికాం సంస్థలు ప్రస్తుతం 4G రీఛార్జీ ప్లాన్ల కంటే సుమారు 5-10 శాతం ధర ఎక్కువ కలిగి ఉంటాయని అంచనావేసింది. అయితే ప్రస్తుతం కంటే 30-40 శాతం అదనపు డేటా అందించనుందని తెలుస్తోంది. ఫలితంగా మార్కెట్‌ను ప్రోత్సహించేందుకు వీలు కల్పిస్తుందని గ్లోబల్‌ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.

ఎయిర్‌టెల్‌ నవంబర్‌లో 2023 నిర్వహించిన సమావేశంలో 5G సేవలకు అధిక ఛార్జీ విధించే అవకాశం ఉందనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌, జియో టెలికాం సంస్థలకు 125 మిలియన్‌ యూజర్లు ఉన్నారు. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి 200 మిలియన్ యూజర్లకు 5G యూజర్ల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel and jio telecom networks may charge for 5G data usage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X