ఎయిర్‌టెల్ యూజర్లు ఈ వస్తువులు కొంటే ఉచితంగా 2GB కాంప్లిమెంటరీ డేటా పొందవచ్చు!!
ఇండియాలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ప్రత్యేకించి స్నాక్స్ మరియు కూల్ డ్రింక్స్ వంటి ఇతర కంపెనీలతో భాగస్వామిగా ఉంది. ఈ ఆపరేటర్ ఇటువంటి ఉత్పతులను కొనుగోలు చేసే వినియోగదారులకు కాంప్లిమెంటరీ డేటాను అందిస్తున్నది. ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్ మళ్లీ అదే తరహాలో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా త్వరలోనే 2GB ఉచిత డేటాను వినియోగదారులకు అందిస్తుంది. కానీ ఈ బోనస్ డేటాను స్వీకరించడానికి వినియోగదారులు టెల్కో భాగస్వామ్యంతో ఎంచుకున్న ఉత్పత్తిని కొనుగోలు చేసి ఆపై ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయడానికి అందించిన కోడ్‌ని ఉపయోగించవలసి ఉంటుంది. ఎయిర్‌టెల్ నుండి లభించే 2GB బోనస్ డేటాను ఎలా పొందవచ్చు వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఉచితంగా 2GB కాంప్లిమెంటరీ డేటా
భారతీ ఎయిర్‌టెల్ తన కో-బ్రాండింగ్ ప్రోగ్రామ్‌ను పెప్సికో ఇండియాతో తిరిగి ప్రారంభించనుంది. రెండోది భారతదేశంలో లేస్, అంకుల్ చిప్స్, డోరిటోస్, కుర్కురే, పెప్సి, మౌంటైన్ డ్యూ, 7UP, ట్రాపికానా వంటి మరిన్నింటితో పాటుగా అత్యంత డిమాండ్ ఉన్న స్నాక్స్ లతో కూడా బాగస్వామంను కలిగి ఉంది. ఇక్కడ పేర్కొన్న చాలా పేర్లు దేశవ్యాప్తంగా చాలా విజయవంతమైన మరియు భారీగా డిమాండ్ చేయబడిన ఉత్పత్తులు.

కొన్ని ఆన్ లైన్ నివేదికల ప్రకారం కో-బ్రాండింగ్ డీల్ మళ్లీ ఈ వారంలోనే రెండు కంపెనీల మధ్య ప్రత్యక్ష ప్రసారం అయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం మార్చి 31, 2022 వరకు కొనసాగనున్నది. ఈ ప్రత్యేక ఒప్పందం ప్రకారం టెల్కో యొక్క ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ప్రొడెక్టుల కొనుగోలు మీద 2GB వరకు కాంప్లిమెంటరీ డేటాను పొందడానికి అర్హులు అవుతారు. ఈ ఆఫర్ కో-బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు మాత్రమే లభిస్తుంది.

నివేదికల ప్రకారం అంకుల్ చిప్స్, కుర్కురే, లేస్ మరియు డోరిటోస్ వంటి ఉత్పత్తులపై ఎయిర్‌టెల్ పేరు బ్రాండ్ చేయబడుతుంది. ఈ కో-బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులు ప్యాకెట్ లోపల ముద్రించిన ‘ఉచిత డేటా వోచర్ కోడ్' కోసం వెతకవలసి ఉంటుంది. ఇంకా వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ అప్లికేషన్‌లోని ‘మై కూపన్' విభాగానికి వెళ్లి ప్యాకేజింగ్ నుండి పొందిన వోచర్ కోడ్‌ను ఎంటర్ చేసి డేటా యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే తప్పనిసరిగా నిబంధనలు మరియు షరతులు ఉంటాయి. మేము కో-బ్రాండెడ్ ఐటెమ్‌లలోని కాంప్లిమెంటరీ డేటాను క్లెయిమ్ చేసుకుంటే కనుక మేము ఖచ్చితంగా వాటి యొక్క వివరాలను మీకు అందిస్తాము.

ఎయిర్‌టెల్ టెల్కో తన యొక్క వినియోగదారులకు అందించే అనేక సేవలలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ కూడా ఒకటి. ఎయిర్‌టెల్ పెమెంట్స్ బ్యాంక్ యొక్క ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS) ప్లాట్‌ఫామ్ ఆధారంగా FY21 లో దాదాపు 50 మిలియన్లకు పైగా నగదు యొక్క విత్ డ్రా లావాదేవీలు నమోదు అయినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల ప్రకటించింది. AePS లో బ్యాంక్ దాదాపు 7% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ లావాదేవీలలో 74% కంటే ఎక్కువ టైర్ 5/6 పట్టణాలలో ఉన్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ పాయింట్ల ద్వారా ప్రాసెస్ చేయబడినట్లు సంస్థ ప్రకటించింది. 500,000 లకు పైగా గల బ్యాంకింగ్ పాయింట్లతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు ఈ బ్యాంకింగ్ పాయింట్లలో 50% AePS ఎనేబుల్ చేయబడ్డాయి. కోవిడ్ సమయంలో కస్టమర్‌లు తమ ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడం కోసం చూశారు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మిలియన్ల మంది భారతీయులకు ఆర్థిక సేవలు అందేంత వరకు ఉండేలా తన రిటైల్ ఆధారిత బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను పెంచడంతో తన సర్వీస్ ను ఇప్పటికి సమర్థవంతంగా నడుపుతూనే ఉంది. AePS ప్లాట్‌ఫామ్ ద్వారా ఆధార్ ఎనేబుల్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ ఉన్న ఇతర బ్యాంకుల ఖాతాదారులకు కూడా బ్యాంక్ సేవలు అందించగలిగింది. FY21 లో AePS ద్వారా నగదు విత్డ్రా లావాదేవీలు ప్రతి త్రైమాసికానికి 10% పైగా వృద్ధిని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications