Home
News

Pepsi తాగండి.. Airtel రీఛార్జీ కూప‌న్లు పొందండి! ప్ర‌త్యేక ఆఫ‌ర్‌!

భార‌త ప్ర‌ధాన టెలికం ఆప‌రేట‌ర్ల‌లో ఒక‌టైన Airtel యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నిత్యం ఏదో ఓ ఆఫ‌ర్‌తో ప్ర‌య‌త్నం చేస్తుంది. ప్ర‌స్తుతం పండ‌గ సీజ‌న్ స‌మీపించిన నేప‌థ్యంలో ఉన్న యూజ‌ర్ల‌తో పాటు కొత్త యూజ‌ర్ల‌ను సైతం ఆక‌ర్షించేలా ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించేందుకు Pepsico ఇండియా కంపెనీతో భాగ‌స్వామ్యాన్ని ఏర్ప‌ర‌చుకుంది. ఇందులో భాగంగా పెప్సీకో ఉత్ప‌త్తుల్ని కొనుగోలు చేసే వారికి Airtel రీఛార్జీ కూప‌న్ల‌ను ఆఫ‌ర్ చేయ‌బోతోంది. అందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌డానికి ఈ ఆర్టిక‌ల్ పూర్తిగా చ‌ద‌వండి.

pepsi

పండుగ సీజన్‌కు ముందు కస్టమర్లకు రీఛార్జ్ కూపన్‌లను అందించడానికి భారతీ Airtel, పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. Pepsi, Mountain Dew, Mirinda, 7UP, Slice మరియు Tropicana PET బాటిళ్లతో సహా పెప్సికో ఇండియా డ్రింక్స్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.10 నుండి రూ.20 విలువైన Airtel రీఛార్జ్ కూపన్‌లను లేబుల్ వెనుక వైపున ఆఫ‌ర్ చేయ‌నుంది.

Pepsico కంపెనీకి చెందిన ఏ బాటిల్ కొనుగోలుపై ఎంత ఆఫ‌ర్‌!

Pepsico కంపెనీకి చెందిన ఏ బాటిల్ కొనుగోలుపై ఎంత ఆఫ‌ర్‌!

* పెప్సీకోకు చెందిన 200ml/ 250ml/ 350ml/ 400ml Pet బాటిల్‌ కొనుగోలు పై వినియోగ‌దారులు రూ.10 Airtel రీఛార్జీ కూప‌న్ పొంద‌వ‌చ్చు.
* 500 / 600 ml బాటిల్‌ కొనుగోలు పై వినియోగ‌దారులు రూ.15 Airtel రీఛార్జీ కూప‌న్ పొంద‌వ‌చ్చు.
* 750ml బాటిల్‌ కొనుగోలు పై వినియోగ‌దారులు రూ.15 Airtel రీఛార్జీ కూప‌న్ పొంద‌వ‌చ్చు.
* 1.2 Ltr/ 1.25 Ltr బాటిల్‌ కొనుగోలు పై వినియోగ‌దారులు రూ.20 Airtel రీఛార్జీ కూప‌న్ పొంద‌వ‌చ్చు.
* 1.75 Ltr/ 2 Ltr/ 2.25 Ltr బాటిల్‌ కొనుగోలు పై వినియోగ‌దారులు రూ.20 Airtel రీఛార్జీ కూప‌న్ పొంద‌వ‌చ్చు.

Pepsico ఉత్పత్తులపై Airtel అందించే డిస్కౌంట్‌ని ఎలా రీడీమ్ చేయాలి!

Pepsico ఉత్పత్తులపై Airtel అందించే డిస్కౌంట్‌ని ఎలా రీడీమ్ చేయాలి!

PepsiCo ప్రొడ‌క్ట్ లేబుల్‌పై Airtel ప్రీపెయిడ్ వినియోగ‌దారుల రీఛార్జీ కోసం 12-అంకెల కూపన్ కోడ్‌ను కంపెనీ ఆఫ‌ర్ చేయ‌డం జ‌రుగుతుంది. ఎయిర్‌టెల్ యూజ‌ర్లు ఈ కోడ్‌ని ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా రెడీమ్ చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అయితే, కనీసం రూ.99 విలువ కలిగిన ప్రీపెయిడ్ రీఛార్జ్ స‌మ‌యంలోనే ఈ కూప‌న్ కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రతి మొబైల్ నంబర్‌కు, డిస్కౌంట్ కోడ్‌లు రెండుసార్లు మాత్రమే పని చేస్తాయి. Airtel మరియు PepsiCo నుండి ఈ ఆఫర్ ఫిబ్రవరి 2023 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

వీటిపైనే కూప‌న్లు పొంద‌గ‌లిగేది!

వీటిపైనే కూప‌న్లు పొంద‌గ‌లిగేది!

ప్సీకో కు చెందిన ఉత్ప‌త్తులు Pepsi®, Mountain Dew®, 7UP®, Mirinda®, Slice® and Tropicana® డ్రింక్స్ యొక్క 200 ml ,250ml, 350ml, 400ml, 500ml,600ml, 750ml, 1.2L, 1.25L, 1.75L, 2L and 2.25L బాటిల్స్‌పైనే ఈ కూప‌న్లు వ‌ర్తిస్తాయ‌ని కంపెనీ పేర్కొంది.

జియో కూడా క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు!

జియో కూడా క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు!

జియో కూడా త‌మ 6వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 11, 2022 మధ్య రోజుల్లో Jio ప్లాన్ల‌తో రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లకు ప్రతిరోజూ రూ. 10 లక్షల విలువైన బహుమతులను అందజేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆఫర్ వ్యవధి మధ్య కాలంలో రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లు బహుమతులు గెలుచుకోవడానికి అర్హులు. అయితే, ఈ బ‌హుమ‌తులకు అర్హుల‌ను ఏవిధంగా ఎంపిక చేస్తారు, నియ‌మాలు ఏంటి అనే విష‌యాల్ని జియో వెల్ల‌డించ‌లేదు. అదేవిధంగా, జియో కంపెనీ త‌మ రూ.2,999 ప్లాన్‌పైనా అద‌నంగా ప‌లు ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్న‌ట్లు పే్కొంది.

 

Best Mobiles in India

English summary
Airtel and PepsiCo India Partner to Offer Recharge Coupons to Customers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X