ఎయిర్‌టెల్ & Vi అందించే హై-ఎండ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు!! వాటి వివరాలు

|

ప్రీపెయిడ్ ప్లాన్‌లు బడ్జెట్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడటం వలన వినియోగదారులలో మరింత ప్రజాదరణ పొందినప్పటికీ, టెలికాం ఆపరేటర్లు అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు వారి స్వంత ప్రయోజనాలతో వస్తాయి. ముఖ్యంగా టెల్కోలు తమ ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌లతో అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తున్నాయి. ఇవి ఒకే ధర ట్యాగ్‌లో బహుళ SIM కేటాయింపులతో పాటుగా OTT సబ్స్క్రిప్షన్ల ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అధిక డేటా మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో మరియు మరిన్ని ప్రయోజనాలతో వెతుకుతున్న వినియోగదారులకు ఈ ప్లాన్‌లు సరైనవి. భారతదేశంలోని రెండు ప్రధాన టెల్కోలు భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా సంస్థలు అందించే హై-ఎండ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల యొక్క ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

భారతి ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ టెల్కో తన యొక్క వినియోగదారులకు అందించే ప్రీమియం ప్లాన్‌లలో మొదటిది రూ.999 ధర వద్ద లభిస్తుంది. ఇది నెలకు రూ.999 చెల్లించడం ద్వారా వినియోగదారులు అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMSలతో పాటు 200GB వరకు రోల్‌ఓవర్‌తో 150GB నెలవారీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు కుటుంబ సభ్యుల కోసం 1 సాధారణ సిమ్ మరియు 2 ఉచిత యాడ్-ఆన్ సాధారణ వాయిస్ కనెక్షన్‌లను పొందుతారు. ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో పాటు ‘ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినం రివార్డ్స్'ని కూడా అందిస్తుంది. ఈ సందర్భంలో అదనపు ఖర్చు లేకుండా 1 సంవత్సరానికి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ మరియు 1 సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ VIP మెంబర్‌షిప్ కు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఇతర ప్రయోజనాలలో ఎయిర్‌టెల్ ఎక్స్-స్ట్రీమ్ యాప్ ప్రీమియం, వింక్ ప్రీమియం, షా అకాడమీకి యాక్సెస్ వంటివి మరిన్ని ఉన్నాయి.

ఎయిర్‌టెల్ హై-ఎండ్ ప్లాన్‌ల జాబితా
 

ఎయిర్‌టెల్ అందించే అత్యంత హై-ఎండ్ ప్లాన్‌ల జాబితాలో రెండవది రూ.1,599 ధర వద్ద లభించే ప్లాన్ అధిక మొత్తంలో నెలవారీ డేటాను అందిస్తుంది. ఎయిర్‌టెల్ రూ.1,599 ధర ట్యాగ్‌తో అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాలలో అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMSలతో పాటు 200 GB రోల్‌ఓవర్‌తో 500 GB నెలవారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 200 నిమిషాల ISD కాల్స్ మరియు IR ప్యాక్‌లపై 10% తగ్గింపును కూడా అందిస్తుంది. వినియోగదారులు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న తర్వాత 1 సాధారణ సిమ్‌తో పాటు కుటుంబ సభ్యుల కోసం 1 ఉచిత యాడ్-ఆన్ సాధారణ వాయిస్ కనెక్షన్‌ని అందుకుంటారు. ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినం రివార్డ్‌లు కూడా అదనంగా ఈ ప్లాన్‌తో వినియోగదారులు పొందవచ్చు. కస్టమర్‌లు వారి ప్లాన్‌కు మరిన్ని కుటుంబ కనెక్షన్‌లను జోడించడానికి రూ.299 చార్జ్ చేయవచ్చు. ఇవి సాధారణ-అపరిమిత కాల్‌లు + 30GB డేటా + 100SMS/రోజు ప్రయోజనాలను అందిస్తుంది. కేటాయించిన ఉచిత యాడ్-ఆన్‌ల వినియోగం తర్వాత ఈ అదనపు కనెక్షన్‌లు రూ. 999 మరియు రూ. 1,599 ప్లాన్‌లపై మాత్రమే వసూలు చేయబడతాయి. అంతేకాకుండా ఒక ఫ్యామిలీ ప్లాన్‌తో గరిష్టంగా 9 యాడ్-ఆన్ నంబర్‌లను జోడించవచ్చు.

వోడాఫోన్ ఐడియా RedX ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా RedX ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా లేదా Vi వ్యక్తిగత వినియోగదారులు మరియు కుటుంబాల కోసం విడివిడిగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. వ్యక్తిగత వినియోగదారుల కోసం Vi యొక్క అత్యంత ప్రీమియం RedX ప్లాన్ ను రూ.1,099 ధర వద్ద అందిస్తుంది. Vi ద్వారా రెడ్‌ఎక్స్ ప్లాన్‌లు బహుళ OTT సబ్‌స్క్రిప్షన్‌లు మరియు మరిన్నింటితో బండిల్ చేయబడ్డాయి. రూ.1,099 ధరతో వినియోగదారులు నెలకు 100 SMSలు మరియు అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు నిజమైన అపరిమిత డేటాకు యాక్సెస్ పొందుతారు. ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో వినియోగదారులు TV మరియు మొబైల్‌లో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా నెట్‌ఫ్లిక్స్‌కు ఏడాది పొడవునా సభ్యత్వానికి ఉచిత యాక్సిస్ ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లు రూ.1,499 విలువైన అమెజాన్ ప్రైమ్ యొక్క ఒక సంవత్సరం సభ్యత్వాన్ని అలాగే రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తాయి. దీనికి అదనంగా రెడ్‌ఎక్స్ ప్లాన్‌లు అంతర్జాతీయ & దేశీయ విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తాయి.

Vi

Vi టెల్కో తన యొక్క వినియోగదారులకు అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల జాబితాలో రెండవది రూ. 2,299 ధర ట్యాగ్‌తో వచ్చే ప్రీమియం ఫ్యామిలీ రెడ్‌ఎక్స్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 5 కుటుంబ సభ్యులకు కనెక్టివిటీని అందిస్తుంది. ప్లాన్ ప్రైమరీ మరియు సెకండరీ కనెక్షన్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు నెలకు 3000 SMSలతో పాటు నిజంగా అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ RedX ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Airtel and Vodafone Idea(Vi) Telcos Offers High-End Postpaid Plans: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X