Home
News

ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 5G డేటా అన్‌లిమిటెడ్‌గా వాడుకోవచ్చు

టెలికాం రంగంలో దూసుకెళ్లేందుకు ఎయిర్‌టెల్‌ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. మరికొన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించేందుకు చకచకా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అన్‌లిమిటెడ్‌ 5G డేటాతో పలు ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీని ద్వారా ఎయిర్‌టెల్‌ 5G అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో హైస్పీడ్‌ అన్‌లిమిడెట్‌ ఇంటర్నెట్‌ను వినియోగించుకొనేందుకు అవకాశం కల్పించింది. వీటితో పాటు కొన్ని ప్రత్యేక ప్లాన్లపై అమెజాన్‌ ప్రైమ్‌ లేదా డిస్ని + హాట్‌స్టార్‌ యాప్‌ సబ్‌స్రిప్షన్‌ను ఉచితంగా వినియోగించుకొనేందుకు అవకాశం కల్పించింది.

Airtel 5g planes

మీరు ఎయిర్‌టెల్‌ 5G వినియోగదారులు అయితే, ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ సహా OTTల్లో ఉచితంగా మీకు నచ్చిన కంటెంట్‌ను చూసెయ్యొచ్చు. ఈ కింది ప్లాన్లతో అమెజాన్‌ ప్రైమ్‌ గానీ డిస్ని+ హాట్‌స్టార్‌ యాప్‌ను గాని సబ్‌స్రైబ్‌ చేసుకోవచ్చు.

రూ.499 ప్లాన్‌ : ఎయిర్‌టెల్‌ వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఎంచుకుంటే 28 రోజులపాటు సేవలను పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిడెట్‌ కాలింగ్ సహా రోజువారీ 100 SMSలు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 3 నెలలపాటు డిస్ని+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్రిప్షన్‌ సహా ఎయిర్‌టెల్‌ Xstream, Wink సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌ తీసుకున్న వినియోగదారులకు 5G నెట్‌వర్క్‌ అందుబాటులో లేకుంటే రోజుకు 3GB వరకు 4G డేటాను వాడుకోవచ్చు.

రూ.839 ప్లాన్‌ : రూ. 839 రీఛార్జ్‌ చేసుకున్న ఎయిర్‌టెల్‌ వినియోగదారులు 84 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటా, అన్‌లిమిడెట్‌ కాలింగ్ సహా రోజుకు 100 SMSలను పొందవచ్చు. మరియు 3 నెలలపాటు డిస్ని+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్రిప్షన్‌తో పాటు ఎయిర్‌టెల్‌ Xstream యాప్‌, రివార్డ్‌ మిని, వింక్‌ యాప్‌ సేవల్ని ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ కలిగిన ఉన్న ఎయిర్‌టెల్‌ వినియోగదారులు తాము ఉన్న ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ అందుబాటులో లేకపోతే.. రోజుకు 2GB చొప్పున 4G డేటాను వినియోగించుకోవచ్చు.

రూ. 3359 ప్లాన్‌ : ఈ ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకున్న ఎయిర్‌టెల్‌ వినియోగదారులు ఒక సంవత్సరం పాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటా, మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజుకు 100 SMSలను వాడుకోవచ్చు. దీంతోపాటు ఏడాదిపాటు డిస్ని+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్రిప్షన్‌, అపోలో 24|7, వింక్‌ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ కలిగి ఉన్న వినియోగదారులు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ అందుబాటులో లేకుంటే రోజుకు 2.5 GB చొప్పున 4G డేటాను వినియోగించుకోవచ్చు.

రూ. 699 ప్లాన్‌ : రూ. 699తో రీఛార్జ్‌ చేయించుకున్న ఎయిర్‌టెల్‌ వినియోగదారులు 56 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజుకు 100 SMSల చొప్పున వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 56 రోజులపాటు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు. మరియు Xstream యాప్‌ సహా వింక్‌ యాప్‌ను కూడా ఉచితంగా వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌ కలిగి ఉన్న వినియోగదారులు వారి ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ అందుబాటులో లేకపోతే.. రోజుకు 3GB చొప్పున 4G డేటాను పొందవచ్చు.

రూ. 999 ప్లాన్‌ : ఈ ప్లాన్‌ కలిగి ఉన్న ఎయిర్‌టెల్‌ వినియోగదారులు 84 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. దాంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజుకు 100 చొప్పున SMSలను వినియోగించుకోవచ్చు. వీటితోపాటు 84 రోజులపాటు అమెజాన్ ప్రైమ్‌ కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు. మరియు Xstream యాప్‌, Wink యాప్‌, RewardMini ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ కలిగి ఉన్న వినియోగదారులు వారి ప్రాంతాల్లో ఎయిర్‌టెల్‌ 5G నెట్‌వర్క్‌ అందుబాటులో లేకుంటే.. రోజుకు 2.5 GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Announced 5G Network Recharge Plans With Free OTT Subscription
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X