Home
News

నిన్న జియో.. నేడు ఎయిర్‌టెల్‌.. రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరలు భారీగా పెంపు.. పూర్తి వివరాలు..!!

టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చాయి. రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచాయి. నిన్న జియో ధరలపై పెంపుపై నిర్ణయం తీసుకోగా. తాజాగా మరో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ రీఛార్జీ ప్లాన్‌ల ధరలను (Airtel Revised Mobile Tariffs 2024) భారీగా పెంచింది. ఎయిర్‌టెల్‌ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ధరల పెరుగుదలతో మెరుగైన నెట్‌వర్క్‌ మరియు స్పెక్ట్రమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మరోవైపు జియో కొత్త ధరలు కూడా జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఎయిర్‌టెల్‌ తాజా నిర్ణయంతో రూ.179 ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ ధర రూ.199గా మారింది. 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మొత్తంగా 2GB డేటాను పొందవచ్చు. అదే రూ.455 ప్లాన్‌ కాస్తా.. రూ.509గా మారింది. 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు మొత్తంగా 6GB డేటాను పొందవచ్చు.

Airtel decided to hike mobile tariffs

ఎయిర్‌టెల్ రూ.1799 ప్లాన్‌.. రూ.1999గా మారింది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 24GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ప్లాన్‌ రూ.265.. రూ.299 గా మారింది. దీని ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 1GB హైస్పీడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. మరియు రోజుకు 100 SMS లను పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

రూ.299 రీఛార్జీ ప్లాన్‌.. రూ.349 గా మారింది. రోజువారీ 1.5GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌,100 SMS లను వినియోగించుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు ప్లాన్‌ రూ.359 ప్లాన్‌.. రూ.409 ప్లాన్ గా మారింది. ఈ ప్లాన్ ద్వారా 2.5GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్‌ తోపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.

రూ.399 ఎయిర్‌టెల్‌ ప్లాన్‌.. రూ.449 గా మారింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులపాటు ఉంటుంది. 3GB రోజువారీ డేటాను పొందవచ్చు. అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ సహా రోజుకు 100 SMS లను ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.479 ప్లాన్‌.. రూ.579 ప్లాన్‌గా మారింది. ఈ ప్లాన్‌ ద్వారా 56 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. రోజువారీ 1.5GB రోజువారీ డేటాను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిడెట్ కాలింగ్ సహా 100 SMS లను పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.549 రీఛార్జీ ప్లాన్‌.. రూ.649 గా మారింది. ఈ ప్లాన్ ద్వారా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజుకు 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులపాటు ఉంటుంది.

అదే విధంగా రూ.719 రీఛార్జీ ప్లాన్.. రూ.859 గా మారింది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. 84 రోజుల వ్యాలిడిటిని కలిగి ఉంటుంది. అలాగే రూ.839 ప్లాన్.. రూ.979 ప్లాన్‌గా మారింది. దీని ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 2GB, 100 SMSలను పొందవచ్చు.

అలాగే ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ రూ.2999.. రూ.3599 గా మారింది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఇందులో భాగంగా రోజువారీ 2GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ సహా రోజుకు 100 SMS లను పొందవచ్చు.

అలాగే యాడ్‌ ఆన్‌ డేటా ప్లాన్‌లోనూ ఎయిర్‌టెల్ మార్పులు చేసింది. రూ.19 డేటా ప్లాన్ రూ.22 గా మారింది. ఇందులో భాగంగా 1GB డేటాను పొందవచ్చు. ఒక్క రోజు వ్యాలిడిటీ ఉంటుంది. అదే రూ.29 ప్లాన్‌... రూ.33 గా మారింది. 2GB డేటాను పొందవచ్చు. వ్యాలిడిటీ ఒక్కరోజు. అదే విధంగా రూ.65 ప్లాన్‌ రూ.77 గా మారింది. 4GB డేటాను పొందవచ్చు. ప్రస్తుత ప్లాన్‌ ఉన్నంత వరకు వ్యాలిడిటీ పొందవచ్చు.

దీంతోపాటు పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లోనూ మార్పులు చేసింది. రూ.399 ప్లాన్‌.. రూ.499 గా మారింది. 40GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు Xstream ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అలాగే రూ.499 ప్లాన్‌.. రూ.549 ప్లాన్‌గా మారింది.

రూ.599 ప్లాన్‌ ... రూ.699 గా మారింది. రెండు కుటుంబ సభ్యులు వినియోగించుకోవచ్చు. 105GB డేటాను పొందుతారు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజుకు 100 SMS లను వినియోగించుకోవచ్చు. Xstream ప్రీమియం, 12 నెలలపాటు డస్నీ + హాట్‌స్టార్‌, 6 నెలలపాటు అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు Wynk ప్రీమియం కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ రూ.999 ప్లాన్‌... రూ.1199 గా మారింది. నలుగురు కుటుంబ సభ్యులు వినియోగించుకోవచ్చు. 190GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. Xstream ప్రీమియం, 12 నెలలపాటు డస్నీ + హాట్‌స్టార్‌, 6 నెలలపాటు అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు Wynk ప్రీమియం కూడా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel announces mobile tariff hike for prepaid and postpaid 2024 here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X