ఐఫోన్5 వేడుకలో ప్రియమణి.....హాట్ హాట్‌గా!

టెక్నాలజీ టైటాన్ ఆపిల్ అధికారిక లాంఛనాల నడుమ తన లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్5ను శుక్రవారం ఇండియాలో విడుదల చేసింది. 16జీబి, 32జీబి, 64జీబి వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ డివైజ్ ధరలను రూ.45,500, రూ.52,500, రూ.59,500గా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ఆవిష్కరణలో భాగంగా అభిమానులతో మరింత మమేకమయ్యే క్రమంలో ఆపిల్ దేశవ్యాప్తంగా నాలుగు వేరువేరు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బెంగుళూరు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వేడుకలో గ్లామర్ నటీ ప్రియమణి, భారతి ఎయిర్‌టెల్ కర్ణాటక ప్రాంత సీఈవో రోహిత్ మల్హోత్రాతో కలిసి ఐఫోన్5ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ ఐఫోన్5 కొనుగోళ్ల పై ఆకర్షణీయమైన పోస్ట్‌పెయిడ్ డేటాప్లాన్‌లను ప్రవేశపెట్టింది.
ఐఫోన్5ను ఆవిష్కరిస్తున్న ప్రముఖ హిరోయిన్ ప్రయమణి, ఎయిర్‌టెల్ కర్ణాటక సర్కిల్ సీఈవో రోహిత్ మల్హోత్రా (ఫోటో గ్యాలరీ):
ఆపిల్ ఐఫోన్ 5 ఫీచర్లు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం), 16జీబి వేరియంట్ ధర రూ.45,000.
ఇతర ఫీచర్లు:
నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్, ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో.

gallery-1
gallery-1
gallery-2
gallery-2
gallery-3
gallery-3


Click it and Unblock the Notifications