రూ. 145తో ఎంతైనా మాట్లాడుకోండి

Written By:

టెలికం మార్కెట్లో టాప్ లో దూసూకుపోతున్న ఎయిర్‌టెల్‌కి ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న జియో నుంచి కష్టాలు తప్పడం లేదు. జియో ఉచిత ఆఫర్లును తట్టుకునేందుకు కష్టమర్లును కాపాడుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు అన్ లిమిటెడ్ ప్లాన్లను వినియోగదారుల ముందుకు తెచ్చింది. నెలరోజుల వ్యవధితో ఈ ప్లాన్లు ఫ్రీ పెయిడ్ వినియోగదారులకు లభిస్తాయి.

జియో దెబ్బకు భారీ నష్టాల్లో టెల్కోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 145 ప్యాక్

వినియోగదారులు రూ. 145తో రీ ఛార్జ్ చేసుకుంటే లోకల్ అండ్ నేషనల్ ఎయిర్ టెల్ టూ ఎయిర్ టెల్ కాల్స్ ఉచితంగా నెల రోజుల పాటు ఆస్వాదించవచ్చు. ఇది అన్ లిమిటెడ్ ప్లాన్. దీంతో పాటు మీకు అడిషనల్ గా 300 ఎంబి 4జీ డేటా లభిస్తుంది. దీంతో పాటు బేసిక్ మొబైల్ ఫోన్స్ వాడేవారికి అదనంగా మరో 50 ఎంబి డేటా లభిస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 345 ప్యాక్

ఈ ఆఫర్ లో వినియోగదారులు ఏ నెట్ వర్క్ కైనా నెలరోజుల పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇండియా మొత్తంలో ఎక్కడికైనా కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు యూజర్లకి 1జిబి 4జీ డేటా అదనంగా లభిస్తుంది. అంతే కాకుండా రూ. 145 ప్లాన్‌లో లాగే ఈ ప్లాన్‌లో కూడా 50 ఎంబి డేటా అదనంగా లభిస్తుంది. నెల రోజుల వ్యాలిడితో ఈ ప్లాన్ మీకు వర్తిస్తుంది.

రోమింగ్

ఈ ప్లాన్లలో మీకు ఎటువంటి రోమింగ్ చార్జీలు ఉండవు. మీరు ఎక్కడినుంచైనా కాల్స్ ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది. రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన రూ. 149 ప్యాక్ తో ఇది పోటీ పడుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఆఫర్ల బాటలో బిఎస్ఎన్ఎల్

ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎన్ఎల్ కూడా ఈ రెండు కంపెనీలలకు ధీటుగా ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 149కే అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది.

సరికొత్త ఆఫర్లతో ముందుకు

ఇదిలా ఉంటే దేశంలో అతి పెద్ద టెలికాంగా పేరుగాంచిన ఎయిర్ టెల్ ఈ రెండు ప్లాన్లను రిలీజ్ చేసిన అనంతరం ఇంకా ఇటువంటి ప్లాన్లను కష్టమర్ల చెంతకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపింది. సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తామని తెలిపింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Airtel announces unlimited free calling across India; announces 2 new packs read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot