Home
News

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ రంగంలో ఎలాన్‌మస్క్‌కు పోటీగా ఎయిర్‌టెల్‌ వన్‌వెబ్‌.. కాస్త ముందుగానే సేవలు..!

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీపై (Satellite Internet) అనేక ప్రముఖ సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌ చుట్టు పక్కల దేశాల్లో సర్వీసులను అందిస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన స్టార్‌లింక్‌ (Starlink) సర్వీసులను భారత్‌ లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే మరో ప్రముఖ సంస్థ ఎయిర్‌టెల్‌ కూడా భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

స్టార్‌లింక్‌ కంటే ముందుగానే..! :
ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్‌ ద్వారా (Airtel OneWeb) సర్వీసులను అందించనుంది. అయితే స్టార్‌లింక్‌ కంటే ముందుగానే ఎయిర్‌టెల్‌ తన సర్వీసులను భారత్‌ లో ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర టెలికమ్యూనికేషన్స్‌ శాఖకు (DoT) ధరఖాస్తు చేసింది. ట్విన్‌ ఎర్త్‌ స్టేషన్‌ గేట్‌వేను భూ దిగువ కక్ష్యలోని గ్లోబల్‌ శాటిలైట్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయాలని భావిస్తోంది.

oneweb satellite internet services

25 దేశాల్లో సేవలు :
దక్షిణ ఆసియా దేశాల్లో పాకిస్థాన్‌, చైనా మినహా అనేక దేశాల్లో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను అందిస్తోంది. భూ దిగువ కక్ష్యలోని శాలిలైట్‌ ల ద్వారా ప్రస్తుతం 25 దేశాల్లో ఈ స‌ర్వీసులు అందిస్తోంది. దీంతోపాటు శ్రీలంక, మాల్దీవులు, నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌ల్యాండ్‌, భూటాన్‌ వంటి దేశాల్లో స్థానిక సంస్థల భాగస్వామ్యంతో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను అందించాలని భావిస్తోంది.

కీలక అనుమతులు :
శాటిలైట్‌ ఇంటర్నెట్‌కు సంబంధించి గ్లోబల్ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ బై శాటిలైట్ సర్వీసెస్‌ (GMPCS) అనుమతులను ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్‌ (OneWeb Satellite Broadband) ఇప్పటికే పొందింది. అనంతరం స్పెక్ట్రమ్‌ కేటాయింపులు పూర్తయితే.. భారత్‌ లో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది.

ఎర్త్‌ స్టేషన్ గేట్‌వే :
అయితే ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ GMPCS అనుమతులను ఇంకా పొందాల్సి ఉంది. దీని ఆధారంగా స్టార్‌లింక్‌ కంటే ముందే వన్‌వెబ్‌ తన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతోపాటు భారత్‌కు సంబంధించి తమిళనాడు, గుజరాత్‌ లో ఎర్త్‌ స్టేషన్ గేట్‌వేలను ఏర్పాటుచేయాలని వన్‌వెబ్‌ భావిస్తోంది.

స్టార్‌లింక్‌ ఇప్పటికే :
ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ సుమారు 100 దేశాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. SpaceX కు చెందిన 7000 శాటిలైట్‌ల ద్వారా సర్వీసులను అందిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, UK, కెనడా, జపాన్‌, మంగోలియాలో స్టార్‌లింక్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. గత డిసెంబర్‌లో భూటాన్‌లోనూ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ను ప్రారంభించింది.

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు :
భూటాన్‌లో స్టార్‌లింక్ రెండు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ లను విడుదల చేసింది. రెసిడెన్షియల్‌ లైట్‌ ప్లాన్‌ ధర నెలకు Nu 3,000 (భారత్‌ కరెన్సీ ప్రకారం సుమారు రూ.3,001) గా ఉంది. ఈ ప్లాన్‌ లో డేటా వేగం 23 Mbps నుంచి 100 Mbps గా ఉంటుంది. స్టాండర్డ్‌ రెసిడెన్షియల్‌ ప్లాన్‌ ధర Nu 4200 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.4201) గా ఉంది.

ఇప్పటికే భారత్‌ లో సర్వీసులను అందించేందుకు వీలుగా కేంద్ర టెలికాం శాఖకు ధరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే భద్రత సహా వివిధ కారణాలతో అనుమతుల మంజూరుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతం పరిశీలన దశ లోనే లైసెన్స్‌ దరఖాస్తు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే భారత్‌ లో స్టార్‌లింక్‌ సేవలు ప్రారంభమయ్యే కంటే ముందుగానే పాకిస్థాన్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన క్యాంపయిన్‌ను స్టార్‌లింక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
airtel backed oneweb expecting to launch satellite internet services earlier than starlink in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X