జియోని క్రాస్ చేసిన ఎయిర్‌టెల్, 4జీ స్పీడ్‌లో అమితమైన వేగం

Written By:

దేశీయ టెలికాం రంగంలో నువ్వా నేనా అనే పోటీ నెలకొన్న నేపథ్యంలో టారిఫ్ వార్ రోజురొజుకు వేడెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. టారిప్ వార్ సంగతి అటుంచితే స్పీడ్ టెస్ట్ లో దిగ్గజాలను నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్, జియోల మధ్య పోటీ రోజురోజుకు మరింతగా ముదిరిపోతోంది. అయితే ఇప్పుడు కొత్తగా జియోని ఎయిర్‌టెల్ క్రాస్ చేసింది. 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ టెస్ట్‌లో దూసుకుపోయింది. జియోను దాటేసి, ఎయిర్‌టెల్‌ మెరుగైన పాయింట్లను స్కోర్‌ చేసిందని తాజా డేటాలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ట్రాయ్‌ చేపట్టిన 4జీ డౌన్‌లోడ్‌ స్పీడు టెస్ట్‌లో.. జియో, వొడాఫోన్‌, ఐడియాల కంటే ఎయిర్‌టెల్‌ మెరుగైన స్కోర్‌ను పొంది, 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ప్రొవైడర్‌గా నిలిచింది.

మొబైల్ యూజర్లకు మరో మంచి శుభవార్త

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆల్ట్రా న్యూస్‌ రిపోర్టు ప్రకారం..

ఆల్ట్రా న్యూస్‌ రిపోర్టు ప్రకారం ఎయిర్‌టెల్‌ సగటు డౌన్‌లోడ్‌ స్పీడు 9.64 ఎంబీపీఎస్‌ కాగ, జియో 4జీ డౌన్‌లోడ్‌ స్పీడు 6.57 ఎంబీపీఎస్‌గా, ఐడియా సెల్యులార్‌ డౌన్‌లోడ్‌ స్పీడు 7.41ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు తెలిసింది.

ఎయిర్‌టెల్‌ సగటు డౌన్‌లోడ్‌ స్పీడు

ఈ రిపోర్టు ప్రకారం ఎయిర్‌టెల్‌ సగటు డౌన్‌లోడ్‌ స్పీడు జియో కంటే 44 శాతం వేగవంతంగా ఉన్నట్టు వెల్లడైంది. టెస్ట్‌ జరిపిన 10 నగరాల్లో హర్యానాలోని భివాని, రాజస్తాన్‌లోని కొటా, కేరళలోని కాలికట్‌ లాంటి నగరాలు ఉన్నాయి.

మైస్పీడు యాప్‌లో..

ఇదిలా ఉంటే మైస్పీడు యాప్‌లో జియో సగటు డౌన్‌లోడ్‌ స్పీడు 20.3 ఎంబీపీఎస్‌గా ఉంది. ఎయిర్‌టెల్‌ 8.9గా, ఐడియా 8.2ఎంబీపీఎస్‌గా రికార్డైంది. అక్టోబర్‌లో నిర్వహించిన ప్రత్యేక ట్రాయ్‌ టెస్ట్‌లో మాత్రం జియో 21.9ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడుతో తొలి స్థానంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

జియోను అధిగమించి, ఎయిర్‌టెల్‌ ముందుకు ..

అయితే ఈ సారి మాత్రం జియోను అధిగమించి, ఎయిర్‌టెల్‌ ముందుకు వచ్చేసింది. తన ప్రత్యర్థులకు పోటీగా ఎయిర్‌టెల్‌ పలు రీఛార్జ్‌ ప్లాన్లను ప్రవేశపెడుతూ వచ్చింది. కంపెనీ ఇటీవలే రూ.499 పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌ కింద అపరిమిత కాల్స్‌, 40జీబీ డేటా, 30రోజుల బిల్లింగ్‌ సైకిల్‌ ద్వారా ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్‌ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel beats Jio, Vodafone in TRAI'S 4G speed test More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot