Airtel Data Packs కేవలం డేటా మాత్రమే కావాలా.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు ఇవిగో..!
ఎయిర్‌టెల్ ప్రస్తుతం టెలికాం రంగంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారీ సంఖ్యలో యూజర్లను కలిగి ఉంది. ఇటీవలే ఎయిర్‌టెల్ రూ.349 రీఛార్జ్ ప్లాన్ ను కూడా తీసుకొచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2GB డేటాను కూడా అందిస్తోంది. మరియు అన్‌లిమిటెడ్ 5G తోపాటు ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చు.
అయితే ఎయిర్‌టెల్ లో అనేక బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ లు ఉన్నాయి. ప్రత్యేకంగా డేటా కోసం డేటా ప్యాక్‌లను తీసుకొచ్చింది. ఇందులో రూ.100, రూ.121, రూ.161, రూ.181, రూ.195, రూ.361 వంటి డేటా ప్యాక్ లు ఉన్నాయి. ఈ ప్లాన్ లు 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నాయి.

రూ.100 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel rs100 Recharge Plan) భాగంగా యూజర్లు 6GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో కాలింగ్, SMS లను పొందలేరు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
రూ.121 డేటా ప్యాక్ :
ఈ రీఛార్జ్ ప్లాన్‌లో (Airtel rs121 Recharge Plan) ఎయిర్‌టెల్ యూజర్లు 6GB 4G డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో కాలింగ్, SMS లు సహా ఎటువంటి అదనపు ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. కేవలం మెసేజ్‌ల కోసమే డేటా కావాల్సి ఉంటే ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
రూ.161 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel rs161 Recharge Plan) భాగంగా యూజర్లు 12GB 4G డేటాను పొందుతారు. డేటా మినహా ఇంకా ఎటువంటి కాలింగ్, SMS లను ఈ ప్లాన్‌లో పొందలేరు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. మెసేజ్‌లు సహా తక్కువ డేటా అవసరాలు ఉన్న యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

రూ.181 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel rs181 Recharge Plan) ఎయిర్‌టెల్ యూజర్లు 15GB డేటాను పొందుతారు. దీంతోపాటు ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. ఇందులో సుమారు 22 OTT సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది.
రూ.195 రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ యూజర్లు ఈ ప్లాన్‌లో (Airtel rs195 Recharge Plan) 12GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు నెల రోజుల వ్యాలిడిటీ వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. మరియు ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
రూ.361 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel rs361 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు ఏకంగా 50GB డేటాను పొందుతారు. అయితే ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








