Home
News

ఎయిర్‌టెల్‌ బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు.. 28 రోజుల వ్యాలిడిటీ సహా పూర్తి వివరాలు..!

ఎయిర్‌టెల్‌ అనేక బెస్ట్‌ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. భారత టెలికాం రంగంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం యూజర్ల కోసం 28 రోజుల వ్యాలిడిటీతో అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ల కాలింగ్‌, డేటా, SMS ఆఫర్ల పూర్తి ప్రయోజనాల వివరాలు.

ఎయిర్‌టెల్‌ రూ.199 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

airtel best prepaid recharge Plans

అయితే ఈ ప్లాన్‌లో (Airtel Rs199 Recharge Plan) పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

రూ.219 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లా్న్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 3GB డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో (Airtel Rs219 Recharge Plan) భాగంగా పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రూ.299 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో యూజర్లు రోజువారీ 1GB డేటాను పొందుతారు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు.

దీంతోపాటు ఈ ప్లాన్‌లో (Airtel Rs299 Recharge Plan) పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.349 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉచితంగా వినియోగించుకోగలుగుతారు. ప్రతిరోజు 1.5GB 4G డేటాతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో (Airtel Rs349 Recharge Plan) ఎయిర్‌టెల్‌ Xstream ప్లే సబ్‌స్క్రిప్షన్‌తో భాగంగా SonyLIV సహా 20 కి పైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, హాలో ట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆపిల్‌ మ్యూజిక్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

రూ.449 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతోపాటు 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 4GB 4G డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు SonyLIV తోపాటు 20 కి పైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను పొందవచ్చు. గూగుల్‌ వన్‌ ద్వారా 30GB క్లౌడ్‌ స్టోరేజీని వినియోగించుకోవచ్చు. ఆపిల్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు.

దీంతోపాటు (Airtel Rs449 Recharge Plan) పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
airtel best prepaid recharge Plans with 28 days validity under Rs500 here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X