Airtel : ప్రతిరోజు 2GB 4G డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటాతో ఎయిర్‌టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు..!
ఎయిర్‌టెల్ ప్రస్తుతం భారత టెలికాం విభాగంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. అయితే ఇతర నెట్‌వర్క్ లకు గట్టిపోటీనివ్వడం సహా యూజర్లను ఆకట్టుకొనేందుకు అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం రూ.1000 ధరలో ప్రతిరోజు 2GB డేటాను అందించే (Airtel 2GB Daily Data Recharge Plans) అనేక రీఛార్జ్ ప్లాన్ లు ఉన్నాయి. ఈ ప్లాన్‌ల ధరలు, డేటా సహా ఇతర ప్రయోజనాల పూర్తి వివరాలు.
ఎయిర్‌టెల్ రూ.379 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ లో (Airtel Rs379 Recharge Plan) ప్రతిరోజు 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిడెట్ కాలింగ్ సదుపాయం ఉంది. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిడెట్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. దీంతోపాటు ఈ ప్లాన్ లో హాలోట్యూన్స్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. మరియు Xstream యాప్ ను ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ.398 రీఛార్జ్ ప్లాన్ : ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Airtel Rs398 Recharge Plan) వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్ లో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ను వినియోగించుకోవచ్చు. మరియు ఉచిత హాలోట్యూన్స్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.649 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ లో (Airtel Rs649 Recharge Plan) భాగంగా రోజువారీ 2GB 4G డేటాతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాల్స్ సహా ప్రతి రోజు 100 SMS లను పొందవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా ఎయిర్‌టెల్ Xstream ప్లే సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. దీంతోపాటు ఉచితంగా హాలోట్యూన్స్ ను వినియోగించుకోవచ్చు. మరియు అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.859 రీఛార్జ్ ప్లాన్ : ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా 84 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతి రోజు 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.
అయితే ప్లాన్ లో (Airtel Rs859 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఉచితంగా హాలోట్యూన్స్ ను ఉపయోగించుకోవచ్చు. మరియు అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు రివార్డ్ మిని సబ్‌స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.979 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ లో రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్ (Airtel Rs979 Recharge Plan) వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. 84 పాటు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఉచిత హాలోట్యూన్స్, అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








