ఎయిర్‌టెల్ ఈ రీఛార్జ్ ప్లాన్‌లతో ఏకంగా సంవత్సరం వ్యాలిడిటీని పొందవచ్చు... పూర్తి వివరాలు..!
ఎయిర్‌టెల్ ప్రస్తుతం దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ గా (Airtel) ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ లెక్కల ఆధారంగా ఎయిర్‌టెల్ 33.5 శాతం యూజర్లను కలిగి ఉంది. ఈ సంవత్సరం జులై నెలలో ఎయిర్‌టెల్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. దీంతో జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీగా యూజర్లు ఇతర నెట్‌వర్క్ లకు పోర్టింగ్ అయ్యారు
అయితే అక్టోబర్ నెలలో మాత్రం ఏకంగా 19.2 లక్షల మంది యూజర్లు కొత్తగా నెట్‌వర్క్ లో చేరారు. అయితే యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌టెల్ అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఇందులో నెలవారీ, మూడు, సంవత్సరం వ్యాలిడిటీని (Airtel One Year Validity Recharge Plan) అందించే ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ.1999, రూ.3599, రూ.3999 రీఛార్జ్ ప్లాన్‌లపై 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ప్రతి నెలా లేదా ప్రతి మూడు నెలలకు రీఛార్జ్ లు చేసేందుకు ఆసక్తిలేని వాళ్లు ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఫలితంగా సంవత్సరం అంతా కాలింగ్, డేటా, SMS సహా ఇతర అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.1,999 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో భాగంగా 365 రోజుల వ్యాలిడిటీని (Airtel Rs1999 Recharge Plan) పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో మొత్తంగా 24GB డేటాను పొందవచ్చు. కేవలం కాలింగ్ అవసరాలు మాత్రమే ఉన్నవారు ఈ ప్లా్న్‌ను ఎంచుకోవచ్చు.
దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా ఉచితంగా హలో ట్యూ్న్స్‌ను పొందవచ్చు. మరియు ఎయిర్‌టెల్ Xstream ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ ధర రూ.1999 గా ఉంది. అంటే నెలవారీ రూ.167 ఖర్చు చేస్తున్నట్లు భావించవచ్చు.
రూ.3599 ప్లాన్ : ఎయిర్‌టెల్ ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీని (Airtel Rs3599 Recharge Plan) పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ ధర రూ.3599 గా ఉండగా.. నెలవారీగా చూసుకుంటే రూ.300 ఖర్చు చేస్తున్నట్లు భావించవచ్చు.
రూ.3999 ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లా్న్‌లో భాగంగా (Airtel Rs3999 Recharge Plan) రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. మొత్తంగా 912.5GB డేటాను వినియోగించుకోవచ్చు. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు.
అయితే ఈ ప్లాన్‌లో భాగంగా డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. దీని వ్యాలిడిటీ కూడా 365 రోజులుగా ఉంది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ మరియు ఎక్కువ డేటా అవసరాలు ఉన్న ఎయిర్‌టెల్ యూజర్లు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. నెలవారీ రూ.333 ఖర్చు చేస్తున్నట్లు భావించవచ్చు.


Click it and Unblock the Notifications








