84 రోజుల వ్యాలిడిటీ, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!
ప్రస్తుతం ఎయిర్‌టెల్ యూజర్ల పరంగా దేశంలో రెండు అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. భారీ సంఖ్యలో ఉన్న తన యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులో ఉన్నాయి. యూజర్ల కాలింగ్, డేటా, OTT అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం 84 రోజుల వ్యాలిడిటీతో (Airtel Recharge Plans With 84 Days Validity) మూడు ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లతో ఓటీటీ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.1029 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs1029 Recharge Plans) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 168GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను 3 నెలల వరకు పొందవచ్చు. మరియు ఉచితంగా హాలోట్యూన్స్‌ను వినియోగించుకోవచ్చు. అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.1129 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2.5GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా ఈ ప్లాన్‌లో భాగంగా 210GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. 84 రోజుల వరకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు.
దీంతోపాటు (Airtel Rs1199 Recharge Plans) ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఉచితంగా హాలోట్యూన్స్‌ను పొందవచ్చు. అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.1798 రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ ప్లాన్‌లో (Airtel Rs1798 Recharge Plans) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS వినియోగించుకోవచ్చు. డేటాపరంగా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న యూజర్‌లు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 252GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు ఉచితంగా హలోట్యూన్స్ ను వినియోగించుకోవచ్చు. అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను పొందవచ్చు.
ఇటీవలే ఎయిర్‌టెల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్పేస్‌ఎక్స్‌కు భారత్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. అనుమతులు ఇవ్వాలంటే.. భారత్‌లో కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలనే షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అనుమతిస్తేనే స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.


Click it and Unblock the Notifications








