Airtel Black : ఎయిర్‌టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ రూ.399.. కాలింగ్, బ్రాడ్‌బ్యాండ్, టీవీ ఛానళ్లు..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కీలక ప్రకటన చేసింది. ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ ను సవరణ చేసింది. రూ.399 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా iPTV సేవలను కూడా పొందవచ్చని తెలిపింది. గతంలో iPTV రీఛార్జ్ ప్లాన్‌లు రూ.699 నుంచి ప్రారంభం అయ్యేవి. తాజా నిర్ణయంతో రూ.399 నుంచే దీని ప్రయోజనాలను పొందవచ్చు. iPTV ద్వారా డేటా, ఓటీటీ, టీవీ ఛానళ్లను ఉపయోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ బ్లాక్ రూ.399 రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ బ్లాక్ రూ.399 ప్లాన్‌లో (Airtel Black Rs399) భాగంగా ల్యాండ్‌లైన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా 10Mbps వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో అందించిన డేటా పూర్తిగా వినియోగించిన తర్వాత.. డేటా వేగం 1Mbps గా ఉంటుంది.

ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌లో భాగంగా కాలింగ్, డేటాతోపాటు 260 TV ఛానళ్లను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఒకే ప్లాన్‌లో కాలింగ్, డేటా, టీవీ ఛానల్స్‌ను కావాల్సిన వారికి ఈ ఎయిర్‌టెల్ బ్లాక్ రూ.399 ప్లాన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీటితోపాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా కావాలనుకొనే యూజర్లకు మరిన్ని ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఎయిర్‌టెల్ బ్లాక్ కొత్త కనెక్షన్ కావాలనుకొనే యూజర్లు రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన వారికి ఇన్‌స్టాలేషన్ ఉచితం. తక్కువ ధరలో డేటా, ల్యాండ్‌లైన్ కాలింగ్, టీవీ ఛానళ్లు కావాల్సిన వారు రూ.399 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
ఈ సంవత్సరం మార్చి నెలలో 2 వేల నగరాల్లో iPTV సేవలను ఎయిర్‌టెల్ ప్రారంభించింది. దీని ద్వారా టీవీ ఛానళ్లు, ఓటీటీ, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను పొందవచ్చు. బేసిక్ ప్లాన్ మినహా మిగిలిన ప్లాన్‌లో గరిష్ఠంగా 29 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. ఇందులో నెట్‌ఫ్లిక్స్, Zee5, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ+ సహా మరిన్ని ఓటీటీలను ఉపయోగించుకోవచ్చు.
మార్చి నెలలో iPTV సేవల ప్రారంభం సమయంలో కొన్ని ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. రూ.699 రీఛార్జ్ ప్లాన్‌లో 40 Mbps స్పీడ్‌తో డేటా, 350 టీవీ ఛానళ్లు, 26 OTT సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అదే రూ.899 ప్లాన్‌లో 100 Mbps వేగంతో ఇంటర్నెట్, 26 ఓటీటీ యాప్స్, 350 టీవీ ఛానళ్లును ఉపయోగించుకోవచ్చు.
రూ.1099 ప్లాన్‌లో 200 Mbps ఇంటర్నెట్ స్పీడ్, 350 టీవీ ఛానళ్లు, 28 ఓటీటీ యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. రూ.1599 ప్లాన్‌లో 300 Mbps ఇంటర్నెట్ స్పీడ్, 350 టీవీ ఛానళ్లు, 29 OTT లను పొందవచ్చు. రూ.3999 ప్లాన్ 1 Gbps డేటా స్పీడ్, 29 OTT యాప్ సబ్‌స్క్రిప్షన్, 350 టీవీ ఛానళ్లను ఉపయోగించుకోవచ్చు.
భారత్ టెలికాం రంగంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. యూజర్ల కాలింగ్, డేటా, ఓటీటీ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఇటీవలే పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం రెండు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది.
రూ.2999 రీఛార్జ్ ప్లాన్‌లో ఇంటర్నేషనల్ రోమింగ్‌లో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. దీంతోపాటు రోజుకు 100 నిమిషాలు (ఇన్‌కమింగ్ + అవుట్ గోయింగ్) కాల్స్ మాట్లాడుకోవచ్చు. 20 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 10 రోజులుగా ఉందని ఎయిర్‌టెల్ తెలిపింది.
రూ.3999 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ డేటా, రోజుకు 100 నిమిషాల వరకు (ఇన్‌కమింగ్ + అవుట్‌గోయింగ్) కాల్స్ మాట్లాడుకోవచ్చు. విమానాల్లో 250MB డేటా, 100 నిమిషాల పాటు అవుట్‌గోయింగ్ కాల్స్, 100 SMS లను వినియోగించుకోవచ్చు. విమానాల్లోని ప్రయోజనాలను 24 గంటల్లోగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు.


Click it and Unblock the Notifications








