తక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అదనపు ప్రయోజనాలు

|

ఇంటర్నెట్ మరియు బ్రాడ్‌బ్యాండ్ సేవలను పొందాలని చూస్తున్న వారి కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని సంస్థలు అందిస్తున్న గొప్ప ప్రణాళికల గురించి తెలుసుకోవాలని చూస్తున్నారా? అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు మేము కొన్ని ముఖ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మరియు అవి తక్కువ ధర వద్ద అందిస్తున్న కొన్ని ప్లాన్ల వివరాలను తెలుపుతున్నాము. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారిలో రిలయన్స్ యొక్క జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ఉన్నాయి.

బ్రాడ్‌బ్యాండ్
 

భారతి ఎయిర్‌టెల్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ సేవలు జియోఫైబర్ స్థాయికి సరిపోలడం లేదు. కానీ కొన్ని ప్రణాళికల్లో కొంచెం ట్వీకింగ్‌తో మరియు కొన్ని మార్పులతో భారతి ఎయిర్‌టెల్ యొక్క ప్రణాళికలు రిలయన్స్ జియోఫైబర్ ప్లాన్‌లతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉండి గట్టి పోటీ పడుతున్నాయి. తక్కువ వేగంతో వస్తున్న శ్రేణులకు ఇది వర్తిస్తుంది మరియు అధిక వేగం పరిధిలో కూడా ఉంటుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలు ఇవేప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలు ఇవే

జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌

భారతి ఎయిర్‌టెల్‌ సంస్థ తన ప్లాన్లలో 300 Mbps నుండి 1 Gbpsవంటి అధిక శ్రేణులలో కూడా డేటా వేగాన్ని అందిస్తుంది. భారతి ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోలో VIP బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికను ప్రవేశపెట్టడంతో విషయాలు మరింత మెరుగుపడ్డాయి. అలాగే జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌ల మధ్య పోటీ మరింత తీవ్రమైంది. 1,000 రూపాయల ధరల శ్రేణికి కూడా ఇది వర్తిస్తుంది.

మీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారుమీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారు

జియోఫైబర్ సిల్వర్ ప్లాన్
 

జియోఫైబర్ సిల్వర్ ప్లాన్

రిలయన్స్ జియో ఫైబర్ నెలకు 849 రూపాయలకు తన సిల్వర్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఒక నెల మొత్తానికి 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో 200GB డేటా ఎఫ్‌యుపిని పొందుతారు. దీనితో పాటు రిలయన్స్ జియోఫైబర్ 200GB అదనపు డేటాను కూడా అందిస్తోంది. కాబట్టి మొత్తం డేటా ఒక నెలలో 400GB అవుతుంది. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ ద్వారా ఉచిత వాయిస్ కాలింగ్, OTT యాప్ లకు చందా వంటివి కూడా రిలయన్స్ జియో వినియోగదారులకు అందిస్తుంది. స్వాగత ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ జియోఫైబర్ చందాదారులు జియో సెట్-టాప్ బాక్స్ మరియు జియో హోమ్ గేట్‌వేను కూడా పొందగలుగుతారు. చందాదారులు ఈ ప్లాన్ ను ఒక సంవత్సరానికి కనుక తీసుకుంటే వారు 800GB నెలవారీ డేటాను లేదా వారి ఎంపికను బట్టి రెండు అదనపు నెలల సేవలను పొందుతారు.

చంద్రయాన్-3 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్న ఇస్రోచంద్రయాన్-3 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్న ఇస్రో

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్లాన్ 999 రూపాయల ధర వద్ద ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా చందాదారులు 200 ఎమ్‌బిపిఎస్ వేగంతో 300GB నెలవారీ డేటాను ఆనందిస్తారు. అయితే దీనితో పాటు చందాదారులకు కొన్ని ఆకర్షణీయమైన అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వీటిలో మూడు నెలలు నెట్‌ఫ్లిక్స్ చందా, ఒక సంవత్సరానికి అమెజాన్ ప్రైమ్ చందా, ZEE5 వార్షిక చందా మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యొక్క అన్ని యాప్ లకు యాక్సిస్ లభిస్తుంది. అలాగే రూ.299ల అదనపు ఖర్చు ద్వారా చందాదారులు తమ ప్లాన్‌ను అపరిమిత డేటాగా మార్చుకొనే అవకాశం కూడా ఉంది.

స్మార్ట్‌ఫోన్‌తో ఈ కోతి చేసిన పనికి నీవెరపోవడం మన వంతుస్మార్ట్‌ఫోన్‌తో ఈ కోతి చేసిన పనికి నీవెరపోవడం మన వంతు

పోలికలు

పోలికలు

ఈ రెండు ప్లాన్‌ల యొక్క పోలికల విషయానికి వస్తే ఇవి రెండు వేరు వేరు ధరలతో వస్తాయి. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ కంటే దాదాపు రూ.50లు ఎక్కువ అయినప్పటికీ జియోఫైబర్ తో పోలిస్తే డేటా యొక్క వేగం 100 ఎమ్‌బిపిఎస్ ఎక్కువగా ఉంటుంది. చందాదారులు ఉపయోగించుకోగల మరో ప్రధాన లక్షణం అపరిమిత డేటా ఎంపిక ఇది ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ రూ.299ల అదనపు ధర వద్ద అందిస్తుంది. కాని అపరిమిత డేటాను కేవలం రెట్టింపు వేగంతో పొందవచ్చు. రిలయన్స్ జియోఫైబర్ ప్లాన్‌తో ఇది సాధ్యం కాదు.

జియోఫైబర్

జియోఫైబర్ వినియోగదారులు వార్షిక సభ్యత్వాన్ని పొందడం ద్వారా వారికి నెలకు గరిష్టంగా 800GB డేటాను పొందవచ్చు లేదా రెండు నెలల అదనపు సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇది మాత్రమే కాదు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని కలిగి ఉండటం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తాయి. మరోవైపు JioFiber ఉచిత సెట్-టాప్ బాక్స్‌ను అందిస్తుండగా దాన్ని పొందే చందాదారులు ఇంకా LCO నుండి ప్రత్యేక కనెక్షన్‌ని పొందాలి మరియు దాని కోసం చెల్లించాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel Broadband Entertainment Plan VS JioFiber Silver Plan: Offers,Price,Extra Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X