Home
News

Airtel మరో అద్భుత ఆఫర్, ఈ సారి బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు..

టెల్కో రంగంలో దూసుకుపోతున్న Airtel ఆఫర్లు మీద ఆఫర్లతో జియోని గట్టిగానే ఢీకొంటోంది.

By Hazarath

టెల్కో రంగంలో దూసుకుపోతున్న Airtel ఆఫర్లు మీద ఆఫర్లతో జియోని గట్టిగానే ఢీకొంటోంది. మొబైల్ యూజర్లకు భారీ ఆఫర్లను ప్రకటించిన ఈ దిగ్గజం ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కూడా అదిరే ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

డేటా రోల్ ఓవర్ ఫీచర్‌..

డేటా రోల్ ఓవర్ ఫీచర్‌..

ఇప్పటి వరకు పోస్ట్‌పెయిడ్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న డేటా రోల్ ఓవర్ ఫీచర్‌ను ఇక మీదట తన బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు కూడా అందజేస్తున్నట్టు ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఒక నెలలో వినియోగించని డేటా మొత్తం..

ఒక నెలలో వినియోగించని డేటా మొత్తం..

దీని వల్ల బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఒక నెలలో వినియోగించని డేటా మొత్తం మరుసటి నెలలో వాడుకునేందుకు వీలుంటుంది. అలా యూజర్లు గరిష్టంగా 1000 జీబీ వరకు వాడుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది.

 మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ..

మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ..

ఈ యూసేజ్‌ను యూజర్లు ఎప్పటికప్పుడు మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా కూడా ట్రాక్ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ వెల్లడించింది.

గరిష్టంగా 100 ఎంబీపీఎస్ వరకు..

గరిష్టంగా 100 ఎంబీపీఎస్ వరకు..

ప్రస్తుతం ఎయిర్‌టెల్ అందిస్తున్న వి-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ దేశ వ్యాప్తంగా 87 నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉండగా, ఆ నెట్‌వర్క్ ద్వారా యూజర్లకు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ అందుతున్నది.

దేశంలోని ఏకైక నెట్‌వ‌ర్క్‌..

దేశంలోని ఏకైక నెట్‌వ‌ర్క్‌..

కాగా ఇలా బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్ల‌కు డేటా రోల్ ఓవ‌ర్ ఫీచ‌ర్‌ను అందిస్తున్న దేశంలోని ఏకైక నెట్‌వ‌ర్క్‌గా ఎయిర్‌టెల్ వి-ఫైబ‌ర్ నిలిచింది.

Best Mobiles in India

English summary
Airtel broadband users can now carry forward unused monthly data more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X