రూ.3,500 కోట్ల డీల్, ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ

Written By:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు 8 సర్కిళ్లలోని ఎయిర్‌సెల్ 4జీ స్పెక్ట్రమ్‌ను భారతి ఎయిర్‌టెల్ రూ.3,500 కోట్లకు కొనుగోలు చేసేంది. ఈ భారీ డీల్‌కు సంబంధించి రెండు కంపెనీలు ఒప్పందాలు కుదర్చుకున్నాయి.

 రూ.3,500 కోట్ల డీల్, ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ

డీల్‌లో భాగంగా ఏపీ - తెలంగాణలతో పాటు తమిళనాడు (చెన్నైతో కలుపుకుని), జమ్మూకాశ్మీర్, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒరిస్సా,‌ బిహార్ ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లోని 8 టెలికం సర్కిళ్లకు సంబంధించిన ఎయిర్‌సెల్ 4జీ స్పెక్ట్రమ్‌ ఎయిర్‌టెల్ సొంతం కాబోతోంది. మరిన్ని వివరాలు క్రింది స్లైడ్‌షోలో...

Read More : ఈ టాబ్లెట్ ధర రూ.4,444, ఏడాది ఇంటర్నెట్ ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

20 MHz స్పెక్ట్రమ్‌

రూ.3,500 కోట్ల డీల్, ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ

ఈ 8 సర్కిళ్లలో ఎయిర్‌సెల్ కంపెనీకి 2,300 బ్యాండ్‌ విడ్త్‌లో 20 MHz 4జీ స్పెక్ట్రమ్‌ ఉంది.

2030 వరకు హక్కులు

రూ.3,500 కోట్ల డీల్, ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ

ఎయిర్‌సెల్ నుంచి కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌ పై ఎయిర్‌టెల్‌కు 2030 వరకు హక్కులుంటాయి.

దేశమంతటా ఎయిర్‌టెల్ 4జీ

రూ.3,500 కోట్ల డీల్, ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ

తాజా డీల్ విజయవంతమైన నేపథ్యంలో భారతి ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 4జీ సేవలనందించే అవకాశం కలిగింది.

ఎయిర్‌టెల్‌కు ఇది రెండో డీల్

రూ.3,500 కోట్ల డీల్, ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ

నెల రోజుల వ్యవధిలో ఎయిర్‌టెల్‌కు ఇది రెండో డీల్.

వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ పరిధిలో ఉన్న

రూ.3,500 కోట్ల డీల్, ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ

కొద్ది రోజుల క్రితమే వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ పరిధిలో ఉన్న ఆరు టెలికం సర్కిళ్లకు సంబంధించిన 4జీ స్పెక్ట్రమ్‌ను రూ.4,428 కోట్లు చెల్లించి ఎయిర్‌టెల్ కొనుగోలు చేసింది.

2032 వరకు హక్కులు

రూ.3,500 కోట్ల డీల్, ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ

వీడియోకాన్ టెలీకమ్యూనికేషన్స్ నుంచి కొనుగోలు చేసిన 1,800 MHz బ్యాండ్ స్పెక్ట్రమ్‌ పై ఎయిర్‌టెల్‌కు 2032 వరకు హక్కులుంటాయి.

ఎయిర్‌టెల్ గురించి క్లుప్తంగా...

ఎయిర్‌టెల్ గురించి క్లుప్తంగా...

భారత్‌కు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలికమ్యూనికేషన్స్ సంస్థ భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ (ఎయిర్‌టెల్)ను 1995 జూలై 7న ప్రారంభించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు సునిల్ భారతి మిట్టల్, దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఎయిర్‌టెల్ సేవలందిస్తోంది. ఎయిర్‌టెల్ తమ జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌కు సంబంధించి 2జీ, 3జీ ఇంకా 4జీ సర్వీసులను దక్షిణ ఆసియాలోని 20 దేశాలకు విస్తరింపజేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel buys Aircel's 4G spectrum in 8 circles for Rs 3.5K cr. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting