ఆఫ్రికా కస్టమర్లకు భారత్‌లో రోమింగ్ ఫ్రీ: ఎయిర్‌టెల్

By Super
|
Airtel Customers from Africa to get Free Incoming Calls while Roaming in South Asian Countries


వన్ నెట్‌వర్క్ సర్వీసులను భారత ఉపఖండానికి విస్తరిస్తున్నట్లు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. ఇందులో భాగంగా ఆఫ్రికాలోని తమ సబ్‌స్క్రయిబర్స్ భారత్ సహా శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలకు వచ్చినప్పుడు రోమింగ్ చార్జీలు లేకుండా ఉచితంగా ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చని పేర్కొంది. దీనివల్ల వారి మొబైల్ బిల్స్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని వివరించింది. ఇందుకోసం ఆఫ్రికన్ యూజర్లు కొత్తగా సిమ్ కార్డు కొనుక్కోవడం లేదా వన్ నెట్‌వర్క్ సర్వీసు కోసం గానీ ప్రత్యేకంగా నమోదు చేయించుకోవడం చేయనక్కర్లేదు. ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలున్న 17 ఆఫ్రికన్ దేశాల్లో వన్ నెట్‌వర్క్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌టెల్ ఆఫ్రికా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆండ్రీ బెయర్స్ తెలిపారు.

ఎయిర్‌టెల్ ‘స్మార్ట్ డ్రైవ్’ అప్లికేషన్!

ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గమ్యస్థానానికి తడబడకుండా చేరుకోవటం.. వెళ్లే దారిలో ట్రాఫిక్ అప్‌డేట్‌ను ముందుగానే తెలుసుకోవటం వంటి విశేషాలతో కూడిన ‘స్మార్ట్ డ్రైవ్’ మొబైల్ అప్లికేషన్‌ను ప్రముఖ టెలికామ్ ప్రొవైడర్ ఎయిర్‌టెల్ ఆవిష్కరించింది. యూజర్ తన మొబైల్‌లో ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసకున్నట్లయితే రూట్ అడ్ర‌ లతో పాటు ట్రాఫిక్ సమాచారాన్ని వాయిస్ ఆధారితంగా తెలుసుకోవచ్చు. దేశంలో ఈ ‘రియల్ టైమ్ నేవిగేషన్’ సర్వీస్‌ను ప్రారంభించిన ఏకైక సంస్థగా తాము గుర్తింపు పొందినట్లు ఎయిర్‌టెల్ వర్గాలు ఒ ప్రకటనలో పేర్కొన్నాయి.

ఈ అప్లికేషన్‌ను పొందాలనుకునే సదరు ఎయిర్‌టెల్ వినియోగదారు తన మొబైల్ ద్వారా ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎయిర్‌టెల్‌లైవ్.కామ్/స్మార్ట్‌డ్రైవ్’’లోకి లాగినై డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ‘‘స్మార్ట్’’ అని టైప్ చేసి ‘543221’కి ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్ ను నెల మొత్తం పొందాలనుకున్న వారు నెలసరి ప్యాక్ కింద రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. ఒక రోజు అప్‌డేట్ కోసం రూ.3 చెల్లించాల్సి ఉంది. టర్న్ బై టర్న్ నేవిగేషన్ అప్లికేషన్‌ను నెల మొత్తం ఉపయోగించుకోవాలనుకునే వారు నెలసరి ప్యాక్ కింద రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. డైలీ ప్యాక్ విలువ రూ.10. ఆండ్రాయిడ్, సింబియాన్, బ్లాక్‌బెర్రీ ఇంకా విండోస్ ప్లాట్‌ఫామ్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X