ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 1జీబి 4జీ డేటా రూ.51కే!
రిలయన్స్ జియోకు పోటీగా భారతి ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్‌ను తెరలేపింది. తన 3జీ, 4జీ మొబైల్ ఇంటర్నెట్ ఛార్జీలను 80 శాతానికి తగ్గిస్తూ సరికొత్త స్పెషల్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్పెషల్ పథకంలో భాగంగా రూ.51కే 1జీబి 3జీ లేదా 4జీ డేటాను పొందవచ్చని ఎయిర్‌టెల్ ప్రకటించింది.
Read More : రూ.5,000 రేంజ్‌లో 10 బెస్ట్ 4జీ ఫోన్‌లు

#1
ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చిన స్సెషల్ స్కీమ్‌లో భాగంగా ఎయిర్‌టెల్ చందాదారులు ముందస్తుగా రూ.1,498పై రీఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది.

#2
ఫలితంగా 1జీబి 3జీ/4జీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఆ తరువాత నుంచి 12 నెలల పాటు రూ.51కే 1జీబి 3జీ/4జీ డేటాను ఉచితంగా పొందవచ్చు.

#3
ఈ 12 నెలల ఆఫకం పిరియడ్‌లో ఎన్ని సార్లయినా రూ.51కే 3జీ లేడా 4జీ డేటాను ఆస్వాదించవచ్చని ఎయిర్‌టెల్ వెల్లడించింది.

#4
ఇదే స్కీమ్‌ను రూ.748లోనూ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎయిర్‌టెల్ సన్నాహాలు చేస్తోంది. ఈ తక్కువ డినామినేషన్ స్కీమ్‌లో భాగంగా 6నెలల పాటు రూ.99కే 1జీబి 3జీ/4జీ డేటాను ఉచితంగా పొందవచ్చు.

#5
ఇప్పటికి ఢిల్లీలో ఉన్న ఈ ఆఫర్ ఈనెల 31 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.

#6
భారీ ఆఫర్లతో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న రిలయన్స్ జియో 4జీతో పోటీ పడేందుకు ఇతర టెలికామ్ ఆపరేటర్ల సిద్దమైన విషయం తెలిసిందే.

#7
నష్ట నివారణా చర్యల్లో భాగంగా ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ టెలికామ్ ఆపరేటర్లు తమ చందదారులు చేజారిపోకుండా ఉచిత అన్‌లిమిటెడ్ డేటాప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి.


Click it and Unblock the Notifications








