ఎక్కువగా డేటాను వినియోగిస్తుంటారా.. అయితే డేటా ప్యాక్స్ ప్రత్యేకంగా మీకోసం..!
Airtel Data Packs : ఎయిర్‌టెల్ ప్రస్తుతం టెలికాం రంగంలో రెండో అతి పెద్ద సంస్థగా ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఇందులో కాలింగ్, డేటా, SMS, OTT వంటి ప్రయోజనాలను అందిస్తోంది. అయితే అధికంగా డేటా అవసరాలు లేదా అత్యవసరంగా డేటా అవసరమయ్యే యూజర్ల కోసం ప్రత్యేకంగా డేటా ప్యాక్స్‌ను కూడా కలిగి ఉంది. ఈ డేటా ప్లాన్‌లు రూ.11 నుంచే అందుబాటులో ఉన్నాయి.
రూ.451 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు 50GB డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజులపాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవ్చచు. ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.

రూ.361 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Rs361 Data Pack) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు 50GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్, డేటా ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది.
రూ.211 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Rs211 Data Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు ప్రతిరోజు 1 GB డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
రూ.181 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Rs181 Data Pack) భాగంగా యూజర్లు ఏకంగా 15GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లోనూ డేటా మినహా ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ Xstream Play ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
రూ.195 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Rs195 Data Pack) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు 15GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ఓటీటీ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంటుంది. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది.
రూ.161 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Rs161 Data Pack) భాగంగా యూజర్లు 12GB డేటాను పొందవచ్చు. డేటా మినహా ఈ ప్లాన్‌లో ఎటువంటి ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
రూ.121 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Rs121 Data Pack) భాగంగా యూజర్లు 6GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో డేటా మినహా ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
రూ.100 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Rs100 Data Pack) యూజర్లు 5GB డేటాను పొందుతారు. దీంతోపాటు 30 రోజులపాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లా్‌న్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








