రూ.299కే నెలంతా ఉచిత కాల్స్, 1జీబి 4జీ ఇంటర్నెట్!

హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో జియో తన వెల్‌కమ్ ఆఫర్ సేవలను మార్చి, 2017 వరకు పొడిగించిన నేపథ్యంలో భారతి ఎయిర్‌టెల్ సరికొత్త ధమాకా ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ జియో యూజర్స్ తరహాలోనే ఎయిర్‌టెల్ యూజర్లు కూడా నెల మొత్తం ఉచిత కాల్స్‌తో పాటు ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. ప్లాన్ వివరాలను పరిశీలించినట్లయితే...

Read More : నోకియాతో చేతులు కలిపిన గూగుల్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.299 పెట్టి రీఛార్జ్ చేయించుకోవల్సి ఉంటుంది

ఈ ప్లాన్‌ను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు ముందుగా రూ.299 పెట్టి రీఛార్జ్ చేయించుకోవల్సి ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్‌లో భాగంగా ఏ నెట్‌వర్క్‌కు అయిన ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ప్లాన్ పిరియడ్ లో 1జీబి 3G/4G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఆఫర్‌ను పొందాలంటే ఏం చేయాలి..?

ముందుగా మీ ఎయిర్‌టెల్ నెంబర్ నుంచి *121*1#కు డయల్ చేయండి.
ఆఫర్‌ను సెలక్ట్ చేసుకుని MyAirtel App ద్వారా రీఛార్జ్ చేసుకోండి.
లేకపోతే మీ సమీపంలోని ఎయిర్‌టైల్ రిటైల్ స్టోర్ వద్దకు వెళ్లి ఆఫర్ గురించి ఆరా తీసి వీలుంటే అక్కడే రీఛార్జ్ చేయించుకోండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లిమిటేషన్స్..

ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.
ప్రస్తుతం ఈ ఆఫర్ Kolkata సర్కిల్ పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు రష్ట్రాల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం, ఎయిర్‌టెల్ 2జీ యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదు.

బీఎస్ఎన్ఎల్ సరికొత్త అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌..

వెల్‌కమ్ ఆఫర్‌కు కొనసాగింపుగా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను రిలయన్స్ జియో అనౌన్స్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లు స్పీడ్ లిమిట్‌తో సంబంధం లేకుండా 3జీ డేటాను అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు.

STV రూ.498

STV రూ.498 బీఎస్ఎన్ఎల్ కొత్త డేటా ప్లాన్‌లో భాగంగా రూ.498 పెట్టి రీఛార్జ్ చేయించుకున్నట్లయితే 14 రోజుల పాటు అపరిమితంగా 3జీ డేటాను పొందవచ్చు. గతంలోనూ STV 1099 పేరుతో ఇలాంటి ఆఫర్‌నే బీఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా 30 రోజుల పాటు స్పీడ్ లిమిట్‌తో పనిలేకుంగా 3జీ ఇంటర్నెట్‌ను పొందే అవకాశాన్ని కల్పించారు.

128కేబీపీఎస్‌కు పడిపోతుంది

జియో అనౌన్స్ చేసిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌‌లో భాగంగా మార్చి 31, 2017 వరకు జియో ఆఫర్ చేసే సేవలను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ ఆఫర్ పిరియడ్‌లో జియో యూజర్లు రోజుకు 1జీబి 4జీ డేటాను మాత్రమే ఉచితంగా ఉపయోగించుకోగలుగుతారు. 1జీబి లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 128కేబీపీఎస్‌కు పడిపోతుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Dhamaka: Make Unlimited Calls to Any Network and Get Free 1GB 3G/4G Data. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot