Airtel ధమాకా ఆఫర్, రూ. 29కే నెల రోజుల వ్యాలిడిటీ డేటా

దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో అనేక మార్పులు వచ్చాయి.

|

దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో అనేక మార్పులు వచ్చాయి. డేటా అనేది అత్యంత చీప్ అయిపోయింది. జియో ఏడాది పాటు ఉచిత ఆఫర్లతో యూజర్లను తన వైపుకు తిప్పుకోవడంతో టెల్కోలు కోట్ల నష్టాలను చవిచూశాయి. ఆ తరువాత జియో కూడా టారిప్ ధరలు ప్రవేశపెట్టడంతో దిగ్గజ టెల్కోలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడే డేటా వార్ అనేది అనివార్యమైపోయింది. జియో తీసుకొచ్చే ప్రతి ఆఫర్ కి కౌంటర్ గా మిగతా టెల్కోలు తమ ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులు చేజారిపోకుండా కాపాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎయిర్‌టెల్ నెల రోజల డేటా ఆఫర్ వ్యాలిడిటీతో దూసుకువచ్చింది. ఆఫర్ పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.

 

మీరు చేసే పనులన్నీ గూగుల్ పసిగడుతుందని తెలుసా, రక్షించుకోవడం ఎలా ?మీరు చేసే పనులన్నీ గూగుల్ పసిగడుతుందని తెలుసా, రక్షించుకోవడం ఎలా ?

రూ. 29 చెల్లించడం ద్వారా..

రూ. 29 చెల్లించడం ద్వారా..

ఈ కొత్త ప్లాన్ ద్వారా యూజర్లు నెల రోజుల పాటు డేటా వ్యాలిడిటీని పొందవచ్చు. రూ. 29 చెల్లించడం ద్వారా మీకు 28 రోజులు పాటు 150 ఎంబి డేటా లభిస్తుంది. అయితే ఇది అంత గ్రేట్ డీల్ కాకపోవచ్చు కాని నెల రోజుల వ్యాలిడిటీ అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

అత్యంత తక్కువ డేటాను వాడేవారికి..

అత్యంత తక్కువ డేటాను వాడేవారికి..

అత్యంత తక్కువ డేటాను వాడేవారికి ఈ ఆఫర్ బాగా పనికివస్తుంది. కాగా ఇదే ప్లాన్ లో జియోతో సరిపోల్చితే కాస్త బెటరేనని చెప్పాలి.కాగా జియోలో రూ. 52 పాన్లో 7 రోజుల వ్యాలిడిటీతో 1.05 జిబి డేటాను అందిస్తోంది.

జియో రెండో ప్లాన్
 

జియో రెండో ప్లాన్

కాగా జియో రెండో ప్లాన్ రూ.98లో కష్టమర్లు 2జిబి డేటాను పొందుతారు. కాగా దీని వ్యాలిడిటీ 28 రోజులు పాటు ఉంటుంది. అయితే మీకు ఈ రెండు ప్లాన్లలో ఎటువంటి అదనపు ప్రయోజనాలు ఉండవు. కేవలం డేటా మాత్రమే లభిస్తుంది. కాల్స్ కాని ఎసెమ్మెస్ లు కాని ఉండవు.

 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ టెస్ట్‌లో

4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ టెస్ట్‌లో

ఇదిలా ఉంటే టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ టెస్ట్‌లో దూసుకుపోయింది. జియోను దాటేసి, ఎయిర్‌టెల్‌ మెరుగైన పాయింట్లను స్కోర్‌ చేసిందని తాజా డేటాలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ట్రాయ్‌ చేపట్టిన 4జీ డౌన్‌లోడ్‌ స్పీడు టెస్ట్‌లో.. జియో, వొడాఫోన్‌, ఐడియాల కంటే ఎయిర్‌టెల్‌ మెరుగైన స్కోర్‌ను పొంది, 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ప్రొవైడర్‌గా నిలిచింది.

 ఆల్ట్రా న్యూస్‌ రిపోర్టు ప్రకారం

ఆల్ట్రా న్యూస్‌ రిపోర్టు ప్రకారం

ఆల్ట్రా న్యూస్‌ రిపోర్టు ప్రకారం ఎయిర్‌టెల్‌ సగటు డౌన్‌లోడ్‌ స్పీడు 9.64 ఎంబీపీఎస్‌ కాగ, జియో 4జీ డౌన్‌లోడ్‌ స్పీడు 6.57 ఎంబీపీఎస్‌గా, ఐడియా సెల్యులార్‌ డౌన్‌లోడ్‌ స్పీడు 7.41ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు తెలిసింది.

జియో కంటే 44 శాతం వేగవంతంగా

జియో కంటే 44 శాతం వేగవంతంగా

ఈ రిపోర్టు ప్రకారం ఎయిర్‌టెల్‌ సగటు డౌన్‌లోడ్‌ స్పీడు జియో కంటే 44 శాతం వేగవంతంగా ఉన్నట్టు వెల్లడైంది. టెస్ట్‌ జరిపిన 10 నగరాల్లో హర్యానాలోని భివాని, రాజస్తాన్‌లోని కొటా, కేరళలోని కాలికట్‌ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Airtel Dhamaka Offer! Now Pay Less Than Rs 30 For One Month Data More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X