Airtel Digital TV ఛానల్ ప్యాక్ ధరలు పెరిగాయి!! అయితే...

|

ఇండియాలోని ప్రముఖ డిటిహెచ్ ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన వినియోగదారుల కోసం పలు రకాల సేవలను అందిస్తున్నది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు వంటి ఇతర ప్రజాదరణ సౌజన్యంతో కూడిన ఆఫర్‌లను భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఒకే గొడుగు కింద ఈ సేవలకు సభ్యత్వాన్ని కూడా అందిస్తున్నది.

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

అయితే ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులకు ఈ సేవలు కొంచెం భారం కానున్నాయి. ఎందుకంటే కొన్ని ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్యాక్‌ల ధరలను పెంచాలని సంస్థ భావిస్తున్నది. అయితే ఇందులో మంచి విషయం ఏమిటంటే ఈ ధరల పెరుగుదల చాలా తక్కువ ఛానల్ ప్యాక్‌లకే పరిమితం కావడం విశేషం. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Samsung Galaxy F22 vs Redmi Note 10: ఈ రెండిటిలో మీ ఛాయస్ దేనికి??Samsung Galaxy F22 vs Redmi Note 10: ఈ రెండిటిలో మీ ఛాయస్ దేనికి??

తమిళ SD ప్యాక్ ధరల పెరుగుదల
 

తమిళ SD ప్యాక్ ధరల పెరుగుదల

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ఇప్పుడు ధరల పెరుగుదలను అందుకున్న మొదటి ఛానల్ ప్యాక్ తమిళ SD ప్యాక్. ఇది ఇప్పటి వరకు నెలవారి చందా రూ.203 ధరను కలిగి ఉండగా ఇప్పుడు ఈ ఛానల్ ప్యాక్ ధరను రూ.208 కు పెంచారు. అలాగే ఆరు నెలల చెల్లుబాటు కాలానికి గల ధరను రూ.1,004 నుండి 1,034 రూపాయలకు పెంచారు. అయితే ఛానల్ ప్యాక్ కోసం మొత్తం సంవత్సర చందా ఖర్చు రూ.2,006 నుండి మునుపటి ధర 2,066 రూపాయలుగానే ఉండడం విశేషం. చందాదారులు ఎక్కువ కాలం సభ్యత్వం తీసుకుంటే వారికి ఇంకా అధిక ప్రయోజనం ఉంటుందని గమనించాలి. నెలవారి రూ.203 ఖర్చుతో వారు నెలవారీగా చెల్లిస్తే రూ.2,400 కంటే ఎక్కువ అవుతుంది. అయితే ఒకేసారి వార్షిక చెల్లింపు విషయంలో వారు ఈ ఛానెల్‌ను డిస్కౌంట్‌తో ఆస్వాదించగలుగుతారు.

Vi, Jio, Airtel యొక్క ప్లాన్‌లను మించిన ప్రయోజనాలతో బిఎస్ఎన్ఎల్ రూ.447 ప్లాన్Vi, Jio, Airtel యొక్క ప్లాన్‌లను మించిన ప్రయోజనాలతో బిఎస్ఎన్ఎల్ రూ.447 ప్లాన్

కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ STB చౌకైన ఎంపిక

కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ STB చౌకైన ఎంపిక

తమిళ SD ఛానల్ ప్యాక్ మాత్రమే కాకుండా తమిళ HD ఛానల్ ప్యాక్ ధర కూడా స్వల్పంగా మార్చబడింది. ఇప్పుడు ఆరు నెలల చెల్లుబాటుకు ఈ ప్యాక్ కోసం చందాదారులు రూ.1,251 లకు బదులుగా రూ.1,281 చెల్లించాలి. అంటే ఈ ప్యాక్ కు కూడా 30 రూపాయలు ఎక్కువ చెల్లించాలి. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి చందాదారులు కాని వినియోగదారులు ఎయిర్‌టెల్ హెచ్‌డి ఎస్‌టిబి యొక్క సెట్-టాప్ బాక్స్ ధర ప్రస్తుతం మార్కెట్‌లోని అన్ని ఎస్‌టిబిలలో 10% అదనపు తగ్గింపుతో అతి తక్కువ అని తెలుసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఎయిర్‌టెల్ డిజిటల్ ఎస్‌టిబి 1,300 రూపాయలకు రిటైల్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Airtel Digital TV Channel Packs Prices Hike: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X