Airtel Digital TV చందాదారుల చేరిక పెరిగింది!!! కానీ.....
భారతీ ఎయిర్‌టెల్ యొక్క డిటిహెచ్ ఆర్మ్ ఎయిర్‌టెల్ డిజిటల్ టివి 2019 త్రైమాసికంలో దాని పనితీరు నివేదికను వెల్లడించింది. ఈ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ డిజిటల్ టివి లక్ష మందికి పైగా కొత్త వినియోగదారులను చేర్చుకున్నది. వీరి చేరికతో మొత్తం వినియోగదారుల సంఖ్య 16.3 మిలియన్లకు చేరుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

ట్రాయ్ టారిఫ్ పాలన అమలవడంతో సెట్-టాప్ బాక్స్‌ల మీద కూడా ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందించింది. సంస్థ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ రూపంలో లీనియర్ సెట్-టాప్ బాక్స్ ఎంపికను అందించినప్పటికీ డిటిహెచ్ ఆపరేటర్లు కొత్త చందాదారులను ఎక్కువ మొత్తంలో చేర్చుకోలేకపోయారు. ఎస్‌టిబిలపై డిస్కౌంట్‌తో పాటు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి స్మార్ట్ టివి బ్రాండ్‌లైన షియోమి, శామ్‌సంగ్, ఎల్‌జిలతో కలిసి ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను తక్కువ ధరకు అందిస్తున్నది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆపరేటర్ కేవలం లక్ష మంది కొత్త వినియోగదారులను మాత్రమే తమలో చేర్చుకోగలిగింది .

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ఆదాయం
భారతి ఎయిర్టెల్ సంస్థ ఇప్పుడు Q3 FY20 యొక్క పూర్తి నివేదికను వెళ్ళడించింది. దీనిలో 4G యూజర్ బేస్ తో పాటుగా ARPU వంటివి పెరిగినట్లు తెలిపింది. అదే నివేదికలో ఎయిర్టెల్ డిజిటల్ టివి యొక్క త్రైమాసిక పనితీరును కూడా టెల్కో వెల్లడించింది. నివేదిక ప్రకారం ఎయిర్టెల్ డిజిటల్ టివి యొక్క మొత్తం ఆదాయం Q3 FY20 లో రూ.792.2 కోట్లకు పెరిగింది.

ఆపరేటింగ్ సిస్టం
భారతి ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ఆపరేషన్ యొక్క లాభం విషయానికొస్తే అంతకుముందు త్రైమాసికంలో 560.7 కోట్ల రూపాయల నుండి 544.1 కోట్ల రూపాయలకు క్షీణించింది. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి యొక్క EBITDA మార్జిన్ 2020 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో 71 శాతంతో పోలిస్తే 68.7 శాతంగా ఉంది. అంతేకాకుండా ఆపరేటింగ్ ఫ్రీ నగదు ప్రవాహం రూ .355.6 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 193.1 కోట్ల రూపాయలుగా ఉంది. కాపెక్స్ విస్తరణ Q2 FY20 రూ .205.2 నుంచి రూ .350.9 కోట్లకు పెరిగింది.

ARPU
చందాదారుల విషయానికి వస్తే ఎయిర్‌టెల్ డిజిటల్ టివి Q3 FY20 లో కేవలం 101,000 మంది కొత్త వినియోగదారులను చేరికతో మొత్తం వినియోగదారుల సంఖ్య 16.3 మిలియన్లతో ముగిసింది. ప్రస్తుతం వినియోగదారుడి యొక్క సగటు ఆదాయం (ARPU) రూ.162 వద్ద కొనసాగుతోంది. అయితే DTH ఆపరేటర్ యొక్క నెలవారీ చర్న్ రేటు 1.6% నుండి 1.8% కు స్వల్పంగా పెరిగింది.

ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్ లో ఎయిర్టెల్ డిజిటల్ టివి స్థానం
ఇండియా మొత్తం మీద ప్రస్తుతం కేవలం నాలుగు పే డిటిహెచ్ ఆపరేటర్లు ఉన్నారు. వారు టాటా స్కై, డిష్ టివి (డి 2 హెచ్ తో సహా), ఎయిర్టెల్ డిజిటల్ టివి మరియు సన్ డైరెక్ట్. ఎయిర్టెల్ డిజిటల్ టివి 16.3 మిలియన్ల చందాదారులతో మూడవ అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ గా కొనసాగుతున్నది. ఈ చార్టులో టాటా స్కై అందరికంటే ముందంజలో ఉంది తరువాతి స్థానంలో డిష్ టివి కొనసాగుతున్నది.

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కొత్త వినియోగదారులను పెద్ద సంఖ్యలో చేర్చలేకపోయింది. ఇదే విషయం ఇతర డిటిహెచ్ ఆపరేటర్ల విషయంలో కూడా ఉంది. టీవీ వీక్షకులు OTT ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను చూడటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. లైవ్ టీవీ ఛానెల్‌లను చూడటానికి కూడా వారు ఎక్కువగా OTT ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడుతున్నారు.


Click it and Unblock the Notifications