Airtel Digital TV యూజర్లకు గొప్ప శుభవార్త!!! ప్లాట్‌ఫాంలో కొత్తగా కొన్ని ఛానెల్‌లు

|

ఇండియాలో డిటిహెచ్ రంగంలో మూడవ అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్ గా ఉన్న ఎయిర్‌టెల్ డిజిటల్ టివి గత వారంలో తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ల కింద కొన్ని బహుళ ఛానెల్‌లను జోడించింది. DTH ఆపరేటర్ దాని వినియోగదారుల పోకడల ప్రకారం నిరంతరం ఛానెల్‌లను జతచేస్తుంది మరియు తొలగిస్తుంది. ఈసారి కూడా ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ బహుళ ఛానెల్‌లను జోడించడమే కాక వాటిలో కొన్నిటిని దాని ప్లాట్‌ఫాం నుండి తొలగించింది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్‌కు జోడించబడిన ఛానెల్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ జతచేసిన కొత్త ఛానెల్స్ వివరాలు

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ జతచేసిన కొత్త ఛానెల్స్ వివరాలు

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తన వినియోగదారులకు జోడించిన కొత్త ఛానెల్‌లలో స్టూడియో వన్ +, Zee ప్లెక్స్ స్క్రీన్ 1, జీప్లెక్స్ స్క్రీన్ 2, జీప్లెక్స్ హెచ్‌డి స్క్రీన్ 1, మరియు జీప్లెక్స్ హెచ్‌డి స్క్రీన్ 2 తో పాటు ‘కొరియన్ టీవీ' ఉన్నాయి. కొత్తగా జోడించిన ఛానెల్‌లలో మొదటిది ‘స్టూడియో వన్ +'. ఈ ఛానెల్ వినియోగదారులకు ఆధ్యాత్మిక కంటెంట్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులు దీనిని ఛానల్ నంబర్ 945 వద్ద యాక్సిస్ చేయవచ్చు.

 

Also Read: విండోస్‌లో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్‌ను పాస్‌వర్డ్‌ సహాయంతో ప్రొటెక్ట్ చేయడం ఎలా?Also Read: విండోస్‌లో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్‌ను పాస్‌వర్డ్‌ సహాయంతో ప్రొటెక్ట్ చేయడం ఎలా?

ఎయిర్‌టెల్ కొత్తగా జోడించిన Zee ఛానెల్‌లు

ఎయిర్‌టెల్ కొత్తగా జోడించిన Zee ఛానెల్‌లు

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కొత్తగా జోడించిన రెండవ ఛానెల్ ‘జీప్లెక్స్ స్క్రీన్ 1'. ఈ ఛానెల్‌లోని కంటెంట్‌ను చూడటానికి వినియోగదారులు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకుండా పే-పర్-వ్యూ సర్వీస్ కింద పొందవచ్చు. జీప్లెక్స్ స్క్రీన్ 1 ఛానెల్ ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో ఛానల్ నంబర్ 269 లో లభిస్తుంది. అలాగే ‘జీప్లెక్స్ స్క్రీన్ 2' ను ఛానల్ 499 లో లభిస్తుంది. ఇది జీప్లెక్స్ స్క్రీన్ 1 వలె అన్ని రకాల సేవలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ కొత్తగా జోడించిన హెచ్‌డి ఛానెల్‌లు

ఎయిర్‌టెల్ కొత్తగా జోడించిన హెచ్‌డి ఛానెల్‌లు

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తన వినియోగదారులకు ఇప్పుడు కొత్తగా హెచ్‌డి ఛానెల్‌లను కూడా జోడించింది. ఇందులో ఛానల్ నంబర్ 270 వద్ద ‘జీప్లెక్స్ హెచ్‌డి స్క్రీన్ 1' మరియు ఛానల్ నంబర్ 500 వద్ద ‘జీప్లెక్స్ హెచ్‌డి స్క్రీన్ 2' అందిస్తున్నది. ఈ ఛానెల్‌లు Zee యొక్క ఎస్‌డి ప్రతిరూపాలు అందించే కంటెంట్‌ను అందిస్తాయి కాని హై-డెఫినిషన్ క్వాలిటీలో ఉంటాయి.

ఎయిర్‌టెల్ జోడించిన కొరియన్ ఛానెల్

ఎయిర్‌టెల్ జోడించిన కొరియన్ ఛానెల్

కొత్తగా జోడించిన మరో ఛానెల్ ‘ఎయిర్‌టెల్ కొరియన్ టీవీ' ఇది ఛానల్ నంబర్ 160 వద్ద యాక్సిస్ చేయడానికి అందుబాటులో ఉంది. దీని యొక్క స్టాండర్డ్ వెర్షన్ ఎయిర్‌టెల్ కొరియన్ టీవీ ఛానెల్ హిందీ మరియు కొరియన్ ఆడియో ఫీడ్‌లలో ప్రసిద్ధ కొరియన్ కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది. భారతదేశంలో రెండవ అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ డిష్ టివి ఇండియా కూడా తన వినియోగదారులకు కొరియన్ డ్రామా యాక్టివ్ సర్వీసును అందిస్తుంది.

ఎయిర్‌టెల్ తొలగించిన ఛానెల్‌లు

ఎయిర్‌టెల్ తొలగించిన ఛానెల్‌లు

గత వారంలో ఎయిర్‌టెల్ తన ప్లాట్‌ఫామ్ నుండి పలు ఛానెళ్లను కూడా తొలగించిందని గమనించాలి. ఎయిర్టెల్ డిజిటల్ టివి తొలగించిన ఛానెళ్లలో ఇండియా న్యూస్ పంజాబ్, ఇండియా న్యూస్ యుపి మరియు ఇండియా న్యూస్ యుకె వంటివి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Airtel Digital TV DTH Operator Adds Multiple Channels on its Platform

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X