ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ HD STB ధరలు తగ్గాయి!! వివరాలు ఇవిగో...

|

భారతీయ ఎయిర్‌టెల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలోనే కాకుండా DTH రంగంలో కూడా అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (DTH) సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటిగా ఉంటూ అధిక వినియోగదారులను కలిగి ఉంది. ఎయిర్‌టెల్ డిజిటల్ TV ఇప్పుడు తన యొక్క వినియోగదారుల సౌలభ్యం కోసం మరియు కొత్త వారిని ఆకట్టుకోవడానికి తన HD (హై-డెఫినిషన్) సెట్-టాప్ బాక్స్‌ల (STB) ధరలను తగ్గించింది. ఇటీవల టాటా ప్లే తన HD మరియు SD STB ధరలను రూ.200 వరకు తగ్గించింది. టాటా ప్లేని అనుసరించి ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కూడా అదే బాటలో పయనిస్తూ ధరలను తగ్గించింది. కాకపోతే ఎయిర్‌టెల్ దాని HD STB ధరలను మాత్రమే తగ్గించింది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ STBల యొక్క కొత్త ధరల వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ HD STB కొత్త ధర

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ HD STB కొత్త ధర

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ఇప్పుడు తన యొక్క HD సెట్ టాప్ బాక్స్ (STB) మీద దాని మునుపటి ధర కంటే రూ.200 వరకు తగ్గింపును అందిస్తోంది. ఎయిర్‌టెల్ డిజిటల్ TV యొక్క HD STB ధర ఇప్పుడు రూ.1850 ధరకు బదులుగా రూ.1650 తగ్గింపు ధర వద్ద లభిస్తోంది. ఈ ధర మార్పు ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతిబింబిస్తోంది. కంపెనీ వెబ్‌సైట్‌లో ఇకపై STBల జాబితాలో SD బాక్స్ కనిపించడం లేదు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో కేవలం HD STB మరియు Xstream వంటి రెండు STB బాక్స్ లు మాత్రమే జాబితా చేయబడ్డాయి. ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అనేది ఎయిర్‌టెల్ అందించే ఆండ్రాయిడ్-పవర్డ్ STB. ధర తగ్గింపు పొందిన తరువాత Xstream బాక్స్ కూడా ఇప్పుడు దాని పాత ధర రూ.2500కి బదులుగా రూ.2000 తగ్గింపు ధర వద్దనే అందుబాటులో ఉంది.

Airtel

Airtel యొక్క HD STBతో వినియోగదారులు డిజిటల్ డాల్బీ సౌండ్‌తో రన్ అయ్యే వారి టీవీలలో ప్రీమియం నాణ్యతతో వీడియో కంటెంట్‌ను చూడవచ్చు. ఇంకా వినియోగదారులు ఎయిర్‌టెల్ నుండి HD STBతో ఎంచుకున్న షోలు మరియు చలనచిత్రాలను రికార్డ్ చేసి ప్లే చేయగల శక్తిని కూడా పొందుతారు.

Airtel Xstream బాక్స్ కొత్త ధరలు
 

Airtel Xstream బాక్స్ కొత్త ధరలు

ఎయిర్‌టెల్ సంస్థ సెప్టెంబర్ 2019లో ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను రూ. 3,999 ధర వద్ద ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్‌తో పాటుగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ఈ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ యొక్క ధరను రూ.2,000కి తగ్గించినట్లు ప్రదర్శిస్తోంది. కంపెనీ గతంలో ఈ బాక్స్‌ను రూ.2,499 ధరకు అందిస్తోంది. టెల్కో ధరను తగ్గించడమే కాకుండా కొత్త కస్టమర్ల కోసం డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, SonyLIV, Eros Now, Hungama వంటి మరిన్ని OTT సబ్‌స్క్రిప్షన్‌లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ లేదా ఏదైనా అధీకృత డీలర్ నుండి కొత్త కనెక్షన్‌లను పొందుతున్న వినియోగదారులకు మాత్రమే సవరించిన ధర వర్తిస్తుంది. అయితే సవరించిన ఈ కొత్త ధర పరిమిత కాల ఆఫర్‌గా ఉండే అవకాశం ఉంది.

టాటా ప్లే HD STB ధర

టాటా ప్లే DTH సర్వీస్ ప్రొవైడర్‌ కూడా తన యొక్క HD STB ధరను మునుపటి కంటే రూ.200 వరకు తగ్గించింది. ఇంతకుముందు రూ.1,899 ధర వద్ద లభించే టాటా ప్లే HD STB ధర ఇప్పుడు రూ.1,699 తగ్గింపు ధర వద్ద అందిస్తోంది. Tata Play యొక్క HD STB కంటే Airtel యొక్క HD STB రూ.50 సరసమైనది. టాటా ప్లేతో మీరు ఇప్పుడు రూ. 1,499 ధర వద్ద SD STBని కొనుగోలు చేయవచ్చు. ఇంతకుముందు టాటా ప్లే SD STB రూ.1,699 ధర వద్ద లభించేది.

Best Mobiles in India

English summary
Airtel Digital TV HD Set-Top Box Prices Reduced Once Again: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X